కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ఒడిశా రైలు ప్రమాదంలో 233కి పెరిగిన మృతుల సంఖ్య - ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

ఒడిశాలోని బాలాసోర్‌ స్టేషన్ సమీపంలో జరిగిన రైల్వే ప్రమాదంలో 233 మంది మరణించారని, 900 మందికి గాయాలయ్యాయని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు.

ప్రమాద స్థలానికి 200కి పైగా అంబులెన్స్‌లను పంపినట్లు చెప్పారు.

భారత్‌లో ఈ శతాబ్దంలో జరిగిన అత్యంత ఘోర రైల్వే ప్రమాదాలలో ఇదొకటి.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

https://twitter.com/ANI/status/1664792615533830146?s=20

కోరమండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌, మరో గూడ్స్ రైలుకి ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అదనంగా 100 మందికి పైగా డాక్టర్లను అక్కడికి తరలించారు.

ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

''రైల్వే ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన, ప్రభావితమైన వారికి అవసరమైన సహాయమంతా అందిస్తాం’’ అని మోదీ ట్వీట్ చేశారు.

https://twitter.com/narendramodi/status/1664665463450918913?s=20

''ప్రమాదం జరిగినప్పుడు నాపై 10 నుంచి 15 మంది పడిపోయారు. ఒక్కసారిగా పరిస్థితి అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. ’’ అని ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒక వ్యక్తి చెప్పారు.

''నా చేతికి గాయమైంది. అలాగే, నా మెడ వెనుకవైపు దెబ్బతింది. నేను ట్రైన్ నుంచి బయటికి వచ్చినప్పుడు, కొందరు చేతులు కోల్పోవడం, కొందరికి కాళ్లు పోవడం చూశాను. కొందరికి ముఖం ఛిద్రమైంది’’అని ఈ ప్రమాదం నుంచి బయట పడిన ఒక వ్యక్తి ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

https://twitter.com/ANI/status/1664703840845983744?s=20

https://twitter.com/AHindinews/status/1664747744488218624?s=20

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+