గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌: పలువురు మృతి, 300 మందికి గాయాలు

భువనేశ్వర్: సూపర్ ఫాస్ట్ ఎక్స్ రైలు కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌‌కు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జూన్ 2వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్ ప్రాంతంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఈ రైలు.. గూడ్స్ రైలును ఢీకొనటంతో.. 3 స్లీపర్ కోచ్ లు మినహా మిగిలిన అన్ని బోగీలు పట్టాలు తప్పాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఏడు బోగీలు ఒకటికి ఒకటి ఢీకొని భారీగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, 300 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నెంబర్ 06782262286కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

Coromandel Express Derails In Balasore After Collision With Goods Train, Several Feared Dead, hundreds injured

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. రైల్వే అత్యవసర విభాగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుంచి కోల్ కతా వెళుతోంది.

ఒడిశా రాష్ట్రం బాలాసోర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు అధికారులు. రెండు రైళ్లు ఒకే లైన్‌లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సిగ్నల్ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు భారీగా ధ్వంసం అయింది. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

కాగా, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురికావడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్ వద్ద ఈ సాయంత్రం గూడ్స్ రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్ ఈస్ట్రన్ రైల్వేతో సమయన్వయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైనవారు 033- 22143526/ 22535185 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

పశ్చిమ బెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజూ షాలిమార్‌లో మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరుతుంది. సంత్రగాచి జంక్షన్, ఖరగ్‌పూర్ జంక్షన్, బాలేశ్వర్, భద్రతక్, జాస్పూర్ కే రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు చెన్నైకు చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+