197 రోజుల కనిష్టానికి కరోనా యాక్టివ్ కేసులు .. భారత్ లో కరోనా తాజా పరిస్థితి ఇదే !!
భారత దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 24,354 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి నుండి 8.8 శాతం స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో కనీసం 234 మంది కరోనా కారణంగా మరణించారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14.29 లక్షల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

భారత్ లో కరోనా తాజా పరిస్థితి ఇదే
భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 2,73,889 వద్ద ఉంది. ఇది 197 రోజుల్లో కనిష్టంగా ఉంది. ఇది మొత్తం కేసులలో 0.81 శాతం కన్నా తక్కువగా ఉంది. ఇదిలా ఉంటే జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 97.86 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 25,455 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,30,68,599 కి చేరుకుంది. మరోమారు కొత్త కేసులు కంటే రికవరీ ఎక్కువగా నమోదు కావడం భారతదేశానికి ఊరటనిస్తుంది ప్రస్తుతం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.38 కోట్లు దాటింది.

తగ్గుతున్న పాజిటివిటీ రేటు .. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇలా ..
రోజువారీ పాజిటివిటీ రేటు - 100 కి గుర్తించిన పాజిటివ్ కేసుల సంఖ్య 1.70 శాతంగా ఉంది. గత 33 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఇది నమోదయ్యింది . వీక్లీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద మొత్తం 89.74 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి 65.25 కోట్లకు పైగా కోవిషీల్డ్ డోసులు, భారత్ బయోటెక్ నుండి 9.1 కోట్ల కోవాక్సిన్ డోస్‌లను కేంద్రం అందుకుం

కేరళలోనే అత్యధిక కొత్త కేసులు .. తర్వాత స్థానంలో మహారాష్ట్ర, తమిళనాడు
కేరళ రాష్ట్రంలోఅత్యధికంగా 13,834 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 46,94,719 కి చేరుకోగా కేరళ రాష్ట్రంలో మరణాల సంఖ్య 25,182 కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో 3105 కరోనా కేసులు నమోదయ్యాయి. 50 మంది మరణించారు. తమిళనాడులో 1,597 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని, మొత్తం సంఖ్య 26,65,386 కు చేరుకుందని, మరణాల సంఖ్య 35,603 కు చేరిందని, మరో 25 మంది మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో 809 కరోనా కేసులు, పశ్చిమ బెంగాల్ లో 708 కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 809 కరోనా కేసులు నమోదు కాగా పది మంది మృత్యువాత పడ్డారు. ఇక పశ్చిమ బెంగాల్లో 708 కరోనా కేసులు నమోదు కాగా 13 మంది మరణించారు. గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో 589 కరోనా కేసులు నమోదు కాగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 1170 కరోనా కేసులు నమోదు కాగా, నిన్న ఒక్కరోజే నలుగురు మృత్యువాత పడ్డారు.

పండుగల నేపధ్యంలో ప్రజలను అలెర్ట్ అంటున్న ప్రధాని మోడీ
ఢిల్లీలో 32 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. నగరంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.05 శాతంగా ఉంది. దేశ రాజధానిలో 409 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. దసరా దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటించి కరోనా కట్టడికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications