భారత్ లో మళ్ళీ 50వేల దిగువకు కరోనా కేసులు ..మరణాల్లోనూ తగ్గుదల .. తాజాగా కేసులు ఎన్నంటే

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. భారతదేశంలో కరోనా కారణంగా గత 24 గంటల్లో 48 ,698 కొత్త కేసులు నమోదు కాగా, 1,183 కొత్త మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు 5.7 శాతం తగ్గుదల కనిపించింది. ఇక ఈ నెలలో రెండవసారి రోజువారీ కేసులు 50 వేల దిగువకు చేరుకున్నాయి. దీనితో, దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడిన వారి మొత్తం సంఖ్య 3,01,83,143 కు చేరుకుంది .

నాలుగు లక్షలకు చేరుకున్న మరణాలు

నాలుగు లక్షలకు చేరుకున్న మరణాలు

దేశవ్యాప్తంగా ఇప్పుడు వరకు నమోదైన మరణాల సంఖ్య 4,00,000 మైలురాయిని చేరుకుంది.ఇక కరోనా మహమ్మారి యాక్టివ్ కేసుల సంఖ్య 5,95,565 కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 2.03% కు క్షీణించిందని, మొత్తం రికవరీల సంఖ్య 2, 91, 93,085 గా ఉందని తెలుస్తుంది. గత 24 గంటల్లో 64,818 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. అంతకుముందు రోజు మొత్తం పరీక్షల సంఖ్య 17,45,809 గా నమోదైంది .

12 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ .. థర్డ్ వేవ్ భయం

12 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ .. థర్డ్ వేవ్ భయం

కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడం కోసం ఇస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పటివరకు 31,50,45,926 కు చేరుకోగా, 61,19,169 మందికి గత 24 గంటల్లో టీకాలు వేసినట్లుగా అధికారిక డేటా చెపుతోంది.కోవిడ్ -19 మహమ్మారి యొక్క ఘోరమైన సెకండ్ వేవ్ నుండి దేశం ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న నేపథ్యంలో, ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో కనుగొనబడిన డెల్టా ప్లస్‌తో సహా వైరస్ యొక్క వివిధ ఉత్పరివర్తనాల కారణంగా మూడవ వేవ్ కు సంబంధించిన భయం ఇప్పుడు ప్రజల్లో ప్రబలంగా ఉంది.

 మహారాష్ట్రలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు అధికం

మహారాష్ట్రలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు అధికం

దేశంలో మొత్తం 51 డెల్టా ప్లస్ కేసులలో , మహారాష్ట్రలో 22, తమిళనాడులో తొమ్మిది, మధ్యప్రదేశ్లో ఏడు, కేరళలో మూడు, పంజాబ్ మరియు గుజరాత్ లలో రెండు, ఆంధ్రప్రదేశ్ ,రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఒడిశా, మరియు కర్ణాటకలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. 12 జిల్లాల్లో దాదాపు 50 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనే అత్యధికంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కారణంగా బాగా దెబ్బ తిన్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+