ఇండియాలో 30 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. గత 24 గంటల్లో 69,878 కొత్త కేసులు
భారతదేశంలో కరోనా బీభత్సం కొనసాగుతూనే ఉంది .తాజాగా 30 లక్షలకు కేసులు చేరుకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్న తీరు ఇబ్బంది కలిగిస్తుంది. ఆగస్టులో గతంతో పోలిస్తే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తాజా కేసులను బట్టి అర్ధం అవుతుంది .

ఇండియాలో గత 24 గంటల్లో 69,878 కొత్త కేసులు, 945 మరణాలు
గత 24 గంటల్లో భారత్ లో 69,878 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో ఇండియా 945 మరణాలను నివేదించింది . దీంతో దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 29,75,702 కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 55,794 కు చేరుకుంది. ప్రస్తుతం, భారతదేశంలో 6,97,330 యాక్టివ్ కేసులు ఉండగా, 22,22,578 మందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. రికవరీ రేటు గత 74.69 శాతానికి పెరిగింది. కేసుల మరణాల రేటు కూడా 1.87 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అమెరికా, బ్రెజిల్ కంటే ఎక్కువగా కరోనా కొత్త కేసులను నమోదు చేస్తున్న ఇండియా
అలాగే, ఇండియాలో ఆగస్టు 21 వరకు మొత్తం 3,44,91,073 నమూనాలను పరీక్షించారు, శుక్రవారం 10,23,836 నమూనాలను పరీక్షించారు, ఇది ఇప్పటివరకు ఒక రోజులో అత్యధికంగా జరిపిన పరీక్షల్లో రికార్డ్ గా చెప్పవచ్చు .రోజువారీ కేసుల వృద్ధి రేటు మందగించడం కొనసాగించడంతో, భారతదేశంలో కరోనావైరస్ కేసుల రెట్టింపు సమయం ఇప్పుడు 30 రోజులకు పడిపోయింది. అయితే టాప్ త్రీ లో ఉన్న మూడు దేశాలతో పోల్చి చూస్తే ఇండియాలోనే గత 16 రోజులుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ కంటే ఎక్కువగా కరోనా కొత్త కేసులను ఇండియా నమోదు చేస్తుంది .
Recommended Video

ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 30 లక్షల కేసులు
ప్రపంచవ్యాప్తంగా, 2,29,49,234 మందికి కరోనా వైరస్ సోకింది, వీరిలో 7.9 లక్షలకు పైగా మరణించారు. యునైటెడ్ స్టేట్స్ కరోనా ప్రభావంతో తీవ్ర నష్టాన్ని చవి చూస్తుంది .ఇక ఆ తరువాత స్థానాల్లో బ్రెజిల్ మరియు భారతదేశం ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో ఈ వైరస్ మొట్టమొదటిసారిగా పుట్టిందని ప్రకటించిన చైనా, ఇక తాజాగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ,బీజింగ్‌లో నివసించే ప్రజలు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కరోనావైరస్ మహమ్మారిని ప్రపంచం రెండేళ్లలోపు అంతం చేయగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది .












Click it and Unblock the Notifications