Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియాలో 70 లక్షలకు చేరువలో కరోనా కేసులు ..24 గంటల్లో 73,272 కొత్త కేసులు , 926 మరణాలు

భారతదేశంలో కరోనా పంజా విసురుతుంది . గత 24 గంటల్లో భారత్‌లో 73,272 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి . 926 మంది మరణించారు. దీనితో మొత్తం దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 69,79,424 నమోదయ్యాయి. మొత్తం 1,07,416 మరణాలు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 8,83,185 క్రియాశీల కేసులు ఉండగా , 59,88,823 రికవరీలు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేరళలో పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రత

కేరళలో పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రత

ఇండియాలో కరోనావైరస్ కేసులు నమోదైన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. కేరళలో మొదటి 10,000 ఇన్ఫెక్షన్లను నమోదు చేయడానికి నాలుగున్నర నెలలు పట్టింది. ప్రస్తుతం కేరళలో ఒకే రోజులో 10,000 కి పైగా కేసులను నమోదు చేస్తుంది . గత కొన్ని వారాలుగా, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాల కంటే ప్రతిరోజూ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నుండి నిన్న ఒక్కరోజే 82,753 మంది కోలుకున్నారు. దీంతో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 59,88,823 కు చేరుకుంది.

 రికవరీలు పెరగటం , క్రియాశీలక కేసులు తగ్గుముఖం పడుతుండటం ఊరట

రికవరీలు పెరగటం , క్రియాశీలక కేసులు తగ్గుముఖం పడుతుండటం ఊరట

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 11, 64, 018 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు . ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అక్టోబర్ 9 నాటికి కరోనా టెస్ట్ ల సంఖ్య 8,57,98,698 కి చేరిందని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తుంది .ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో క్రియాశీల కేసులు 12.65 శాతానికి తగ్గాయి .రికవరీ రేటు 85.81 శాతానికి పెరిగింది. కానీ శీతాకాలంలో కేసులు పెరిగే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహారాష్ట్రలో 15లక్షలకు పైగా కరోనా కేసులు

మహారాష్ట్రలో 15లక్షలకు పైగా కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా కేసులు చూసినట్లయితే వరకు మొత్తం 15 ,06 ,018 నమోదయ్యాయి. అందులో 2,36,491 యాక్టివ్ కేసులు కాగా 12,29,339 మంది ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 39,732 మరణాలు సంభవించాయి. కరోనా వ్యాప్తిలో రెండవ స్థానంలో ఇండియా లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 7,44,864 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Top News Of The Day : ప్రపంచంలో అత్యంత కాలుష్య కారక నగరాల్లో రెండు మన తెలుగు నగరాలే! || Oneindia
     రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో కర్ణాటక

    రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో కర్ణాటక

    ప్రస్తుతం ఏపీలో 47,665 యాక్టివ్ కేసులు ఉండగా 6,91,040 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మరణాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,159 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఏపీ తర్వాత కర్ణాటక రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు చూస్తే 6,90,269 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు 1,18,851 ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,61,610 మంది కాదా, కరోనా కారణంగా కర్ణాటక రాష్ట్రంలో 9,789 మంది మృతి చెందారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+