భారత్ లో కరోనా విజృంభణ ...గత 24 గంటల్లో 35,871 కొత్త కేసులు ,172 మరణాలు
ఊహించని విధంగా ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. క్రమంగా కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటుగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. భారత్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, కరోనా సెకండ్ వేవ్ ను అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలను సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సూచించిన 24 గంటల్లోపే భారీగా కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 35,871 కొత్త కరోనా కేసులు, 172 మరణాలు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో 35,871 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య గురువారం 252,364 కు చేరింది. ఇది మొత్తం కేసులలో 2.05%. 172 కొత్త మరణాలతో మరణాల సంఖ్య 159,216 కు పెరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో , రోజువారీ నమోదైన కేసులను ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి .

ఈ ఏడాది ఇదే అత్యధిక రోజువారీ కేసుల నమోదు
గత 102 రోజులుగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాలేదని తెలుస్తుంది.
గడచిన 24 గంటల్లో 10.63లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 35,871 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,14 ,74, 605 కి చేరింది . ఇక కొత్తగా కరోనా నుండి బయట పడిన వారి సంఖ్య 17,741. దీంతో మొత్తం రికవరీ ల సంఖ్య 1,10,63 ,025 కు చేరింది. రికవరీ రేటు 96.65 శాతం నుంచి 96.56 శాతానికి తగ్గింది.

మహారాష్ట్రలో కరోనా పంజా .. రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతోంది. దేశంలోనే 64% కొత్త కేసులు మహారాష్ట్రలోని నమోదు అవుతున్నట్లుగా తెలుస్తుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో మహారాష్ట్రలో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్ డౌన్ విధిస్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. విపరీతంగా పెరుగుతున్న కేసులతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది. అతి విశ్వాసం మంచిది కాదని , కరోనా నింధనలను కఠినంగా అమలు చెయ్యాలని కేంద్రం పేర్కొంది .












Click it and Unblock the Notifications