3వేలకు చేరువలో ఉధృతంగా కరోనా కేసులు.. లాక్ డౌన్ పై చర్చ!
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్న ప్రజలలో మాత్రం సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అవగాహన మాత్రం పెరగడం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు మూడు వేలకు చేరువలో ఉన్నాయి.
దేశంలో భారీగా కరోనా కేసులు
భారతదేశంలో నేడు 2,710 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్టు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించాయి. కేరళలో ఇప్పటివరకు 1147 కరోనా కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223, కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల్లో పేర్కొంది.

కరోనా కారణంగా ఇప్పటివరకు మరణాలు ఇలా
ఇక ఇప్పటివరకు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడించాయి. మే 26వ తేదీన దేశవ్యాప్తంగా 1010కరోనా కేసులు నమోదు కాగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 2,710కరోనా యాక్టివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో చనిపోయిన ఏడుగురిలో మహారాష్ట్రలో ఇద్దరు మృతిచెందగా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలలో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు.
కరోనా కొత్త వేరియంట్ తో ఈ లక్షణాలు
ఇక ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందిన వారు ఎక్కువ మంది వృద్ధులే కావడం గమనార్హం. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నటువంటి కొత్త వేరియంట్ జేఎన్ వన్ వేరియంట్ గా చెబుతున్నారు. ఈ వేరియంట్ కారణంగా జ్వరం, గొంతు నొప్పి , తలనొప్పి, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఆకలి లేకపోవడం. వికారం, విపరీతమైన అలసట. జీర్ణాశయ సమస్యలు వంటి లక్షణాలు వస్తాయని చెబుతున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులతో లాక్ డౌన్ పై చర్చ
అయితే కరోనా కొత్త వేరియంట్ కు సంబంధించిన లక్షణాల గురించి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని సూచిస్తున్నారు. ఇక తాజా కేసుల పెరుగుదలతో మరోమారు లాక్ డౌన్ పై చర్చ జరుగుతుంది, కేసుల కట్టడికి లాక్ డౌన్ పెట్టే అవకాశం ఉందా అన్నది అందరూ చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications