వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్: లాక్ డౌన్ తో మానసిక సంక్షోభం..బయటపడండిలా !!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. కరోనా వైరస్ ప్రబలకుండా విధించిన లాక్ డౌన్ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకు వస్తుంది. కొందరు కుటుంబంతో కాలక్షేపం చేస్తుంటే కొందరు మాత్రం భవిష్యత్ గురించి టెన్షన్ పడుతున్నారు. లాక్ డౌన్ తో ఆర్ధికంగా నష్టపోతున్నామన్న భయం , ఆర్ధికంగా ఉన్న కమిట్మెంట్స్ , బయట సమాజంలో తిరగటానికి వీలు లేని పరిస్థితి వెరసి చాలా మంది మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. ఇక దీంతో ప్రజలు ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం.. ఇంగ్లీష్ మీడియం కోసం సుప్రీం కోర్టుకు వెళ్తాం : ఏపీ విద్యాశాఖామంత్రిఇచ్చిన మాటకు కట్టుబడ్డాం.. ఇంగ్లీష్ మీడియం కోసం సుప్రీం కోర్టుకు వెళ్తాం : ఏపీ విద్యాశాఖామంత్రి

 ప్రజల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్న లాక్ డౌన్

ప్రజల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్న లాక్ డౌన్

మార్చి 22 నుంచి దేశ ప్రజలు ఇళ్లకే పరిమితం అయి జీవనం సాగిస్తున్నారు. కొందరు ఏవో వ్యాపకాలతో కాలక్షేపం చేస్తుంటే కొందరు మాత్రం విపరీతంగా టెన్షన్ పడుతున్నారు. ఒకవైపు కరోనా వస్తుందేమో అన్న భయం , ఇంకో వైపు ఏ పనులు చేసుకోలేకపోతున్నామే .. ఆర్ధిక అవసరాలు ఎలా తీరేది అన్న టెన్షన్ , మరో వైపు బయట స్నేహితులు , బంధువులతో నిత్యం కలివిడిగా తిరిగే వాళ్ళమే ఇప్పుడు ఎందుకీ పరిస్థితి అన్న ఫీలింగ్ ఇవన్నీ చాలా మంది ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి.

 ఇంట్లో ఉండాలంటే నరకంగా ఫీల్ అవుతున్న ప్రజలు

ఇంట్లో ఉండాలంటే నరకంగా ఫీల్ అవుతున్న ప్రజలు

ఎక్కడి వ్యక్తులు అక్కడే ఉండిపోవడంతో అన్ని రకాల ఇబ్బందులు ముందు ముందు మీద పడతాయేమో అన్న ఆందోళన చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది . పరిశ్రమలు మూతపడటంతో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక లాక్ డౌన్ మరింత పొడిగించిన నేపధ్యంలో ఇంట్లో ఉండాలంటే నరకంలా ఫీల్ అవుతున్న వారు ఉన్నారు . మనిషి బయటకు వచ్చి అందరితో కలిసి తిరుగుతుంటేనే మానసికంగా బలంగా ఉంటారు కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవటంతో చాలా మంది ప్రజల మానసిక సంఘర్షణ నాలుగింతలు పెరుగుతుంది.

 నాలుగు గోడల మధ్య ఉంటె మానసిక సంఘర్షణ

నాలుగు గోడల మధ్య ఉంటె మానసిక సంఘర్షణ

నాలుగు గోడల మధ్య ఉంటె మానసిక పరిస్థితిలో మార్పు వస్తుందని మానసిక నిపుణుల అభిప్రాయం . కరోనా ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందా అంటే అవుననే అంటున్నారు మానసిక వైద్యులు. ఒకేచోట ఎక్కువ సమయం ఉండటం వలన వారి మానసిక ప్రవర్తనలో తెలియని మార్పులు వస్తాయని వారు పేర్కొంటున్నారు. అందుకే కోపం, ద్వేషం, తెలియని అసహనం వంటి లక్షణాలు కలుగుతున్నాయని చాలా మంది ఇప్పటికే తీవ్ర మనో వేదనకు లోనవుతున్నారని , జనాలలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఫీలింగ్ కూడా కలిగే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు అంటున్నారు.

మనసుకు నచ్చిన పని చెయ్యటం , వ్యాయామం చెయ్యటం చాలా అవసరం

మనసుకు నచ్చిన పని చెయ్యటం , వ్యాయామం చెయ్యటం చాలా అవసరం

దీని నుంచి బయటపడాలి అంటే లాక్ డౌన్ గురించి, కరోనా వైరస్ గురించి ఆలోచించటం మానేసి ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే మంచిదని మానసిక వైద్యులు చెప్తున్నారు. సరైన వ్యాయామం , ధ్యానం , యోగా వంటివి ఈ మానసిక ఒత్తిడి నుండి కాస్త ఊరటనిస్తాయని చెప్తున్నారు . పదేపదే సమస్యను భూతద్దంలో పెట్టి చూడటం మానేసి మనసుకు నచ్చిన పని చెయ్యాలని చెప్తున్నారు. సంగీతం వినటం , గార్డెనింగ్ చెయ్యటం , పిల్లలతో సరదాగా ఆడుకోవటం వంటి చర్యలతో కాస్త టెన్షన్ నుండి బయట పడవచ్చని చెప్తున్నారు.

English summary
The lockdown imposed by the government for coronavirus control has brought significant change in people's lives. While some are entertaining with the family, some are anxious about the future. Fear of financial loss with lockdown, financial commitments, and the inability to move outside the community, many people are in a state of psychological conflict. due to mental stress People are facing many health problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X