భారత్ లో క్షీణిస్తున్న కరోనా మహమ్మారి : తాజాగా 25,072 కేసులు, 389 మరణాలు !!

భారతదేశంలో కరోనా కేసులు ఐదు నెలల కనిష్టానికి తగ్గినట్లుగా తాజా లెక్కలు చెబుతున్నాయి. భారీగా తగ్గిన కొత్త కేసులు భారత్ కు కాస్త ఉపశమనం ఇస్తున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 25,072 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 19 శాతం తగ్గుదల నమోదయినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు గత 24 గంటల్లో దేశంలో 389 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రియాశీల రేటు తగ్గటం, రికవరీ రేటు పెరగటం దేశానికి ప్రస్తుతం ఊరట కలిగిస్తున్న అంశం.

భారతదేశంలో క్రియాశీలక కేసులు 3,33,924

భారతదేశంలో క్రియాశీలక కేసులు 3,33,924

భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న మొత్తం కేసులు 3.24 కోట్లకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756 గా ఉంది. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి బారి 44,157 మంది కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలు 3.16 కోట్లకు చేరుకున్నాయి. కొద్ది రోజులుగా క్రియాశీల కేసులు కూడా భారీగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో క్రియాశీల కేసులు 3,33,924 గా ఉంది.

రికవరీ రేటు 97.63 శాతం

రికవరీ రేటు 97.63 శాతం

గత 28 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా ఉంది . ప్రస్తుతం 1.03 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1.20% గా ఉంది. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.63 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 200 మిలియన్ మార్కును అధిగమించాయి. ప్రపంచ దేశాలలో మూడింట ఒక వంతు దేశాలలో కేసులు పెరుగుతున్నాయి. వాటిలో చాలా వరకు తమ జనాభాలో సగం మందికి కూడా మొదటి మోతాదు ఇవ్వలేదు.

కేరళలో భారీగా కేసులు .. 24 గంటల్లో కేరళ 10,402 కొత్త కేసులు

కేరళలో భారీగా కేసులు .. 24 గంటల్లో కేరళ 10,402 కొత్త కేసులు

గత 24 గంటల్లో కేరళ 10,402 కేసులను నివేదించింది. కరోనా మహమ్మారి కారణంగా కేరళ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 38,14,305 కి చేరుకుంది. దేశంలో కొత్త ఇన్ఫెక్షన్లలో 50 శాతానికి పైగా దక్షిణాది రాష్ట్రమైన కేరళ నుండే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. కేరళలో పరీక్ష సానుకూలత 13.63 శాతంగా ఉంది. దేశంలో అత్యధికంగా దెబ్బతిన్న రాష్ట్రమైన మహారాష్ట్రలో 24 గంటల్లో 4,141 కొత్త కేసులు నమోదు కాగా, 145 మరణాలు సంభవించాయి.

ఢిల్లీలో మళ్ళీ జీరో మరణాలు , ఏపీలో క్రియాశీల కేసులు ఇలా

ఢిల్లీలో మళ్ళీ జీరో మరణాలు , ఏపీలో క్రియాశీల కేసులు ఇలా

కరోనా మహమ్మారి కారణంగా ఢిల్లీలో రోజువారీ మరణాలు వరుసగా మూడో రోజు నమోదయ్యాయి. జాతీయ రాజధానిలో 24 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే పాజిటివిటీ రేటు 0.04 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. మహమ్మారి రెండవ తరంగం ప్రారంభమైనప్పటి నుండి ఢిల్లీలో కరోనా రోజువారి మరణాలు లేకపోవడం ఇది 13వ సారి. ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివ్ కేసులు 15,000 మార్క్ కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో 14,677 క్రియాశీల కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

కొనసాగుతున్న వ్యాక్సినేషన్ .. 58 కోట్లకు చేరుకున్న వ్యాక్సిన్ డోసులు

కొనసాగుతున్న వ్యాక్సినేషన్ .. 58 కోట్లకు చేరుకున్న వ్యాక్సిన్ డోసులు

భారతదేశంలో కోవిడ్ -19 టీకా కార్యక్రమం ఇప్పటివరకు 58 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ నాటికి అర్హులైన పెద్దలందరికీ టీకాలు వేయాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో రైల్వే 36,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిందని కేంద్ర మంత్రి రావుసాహెబ్ దన్వే వెల్లడించారు. గూడ్స్ రైళ్లు మాత్రమే ఆదాయాన్ని అందించాయని పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో ఈ రైళ్లు వస్తువులను తీసుకెళ్లడంలో మరియు ప్రజలకు ఉపశమనం కలిగించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి అని మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+