corona in India : మళ్ళీ పెరిగిన కేసులు .. తాజాగా 41,195 కొత్త కేసులు, 490మరణాలు

భారతదేశంలో కరోనా కేసుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లోనూ రోజువారీ కరోనా కేసులు పెరగడం టెన్షన్ పెడుతోంది. గత 24 గంటల్లో 41,195 కొత్త కేసులు నమోదు చేసిన భారతదేశం అంతకు ముందు రోజుతో పోలిస్తే 7.4 శాతం కేసుల పెరుగుదల చూసింది. ప్రస్తుతం నమోదైన తాజా కేసులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 3.20 కోట్లుగా నమోదయింది. మొత్తం మరణాలు 4.29 లక్షలకు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది.

గత 24 గంటల్లో 490 మంది మృతి, 3,87,987 కరోనాయాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో 490 మంది మృతి, 3,87,987 కరోనాయాక్టివ్ కేసులు


గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడిన వారు 490 మంది మరణించారు. ప్రస్తుతం భారతదేశంలో 3,87,987 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కరోనా నిర్ధారణ కోసం చేసిన పరీక్షలు 48,73,70,196 కు చేరుకున్నాయి. దేశంలోని రోజువారీ కేసులలో కేరళ రాష్ట్రం నుండి అత్యధికంగా కేసులు నమోదు అవుతుండటం గమనార్హం. గత 24 గంటల్లో కేరళ 23,500 కేసులను నమోదు చేసింది. దేశంలో కొత్త ఇన్ఫెక్షన్లలో 50 శాతానికి పైగా దక్షిణాది రాష్ట్రం నుండే నమోదవుతున్న పరిస్థితి ఉంది.

 కేరళలో వ్యాక్సిన్లు తీసుకున్నవారికి 40 వేల మందికి పైగా కరోనా

కేరళలో వ్యాక్సిన్లు తీసుకున్నవారికి 40 వేల మందికి పైగా కరోనా

వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ కేరళ రాష్ట్రంలో 40 వేల కంటే ఎక్కువ మందికి కరోనా సోకినట్లుగా కేంద్రం గుర్తించింది.దీంతో కేరళలో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భారతదేశంలో కేరళ తర్వాత కొత్త కేసులు నమోదులో మహారాష్ట్ర ఉంది. దేశంలో అత్యధికంగా దెబ్బతిన్న రాష్ట్రం అయిన మహారాష్ట్ర ఇప్పటివరకు 63,69,002 కేసులను నమోదు చేసింది. గత 24 గంటల్లో 5,560 కొత్త నమోదు కాగా, 163 మరణాలు సంభవించాయి. మంగళవారం మహారాష్ట్రలో 5,609 కొత్త కేసులు, 137 మరణాలు నమోదయ్యాయి.

దేశ రాజధానిలో తాజాగా 37 కొత్త కేసులు

దేశ రాజధానిలో తాజాగా 37 కొత్త కేసులు

భారతదేశ పరీక్ష పాజిటివిటీ రేటు 2.23 శాతం వద్ద 5 శాతం మార్కు కంటే తక్కువగా ఉన్నాయి. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1.21% గా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.45 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ రాజధానిలో బుధవారం 37 కేసులు కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.06 శాతానికి తగ్గింది.ఇదిలా ఉంటే భారతదేశంలో కోవిడ్ -19 టీకా కవరేజ్ 52 కోట్ల మార్కును దాటింది. బుధవారం సాయంత్రం వరకు 40 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu
     ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లను దాటిన కరోనావైరస్ కేసులు

    ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లను దాటిన కరోనావైరస్ కేసులు

    డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) భారతదేశంలో ఉపయోగించే రెండు ప్రధాన టీకాలైన కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ మిక్సింగ్‌పై అధ్యయనానికి ఆమోదం తెలిపింది. ఈ అధ్యయనం మరియు దాని క్లినికల్ ట్రయల్స్ వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ద్వారా నిర్వహించబడతాయి.రాయిటర్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు బుధవారం 200 మిలియన్లను అధిగమించాయి. ప్రపంచ దేశాలలో మూడింట ఒక వంతు దేశాలలో కేసులు పెరుగుతున్నాయి, వాటిలో చాలా వరకు తమ జనాభాలో సగం మందికి మొదటి మోతాదు కూడా ఇవ్వలేదని తెలుస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+