భారత్ లో కరోనా .. కేసుల ఊగిసలాట, డెల్టా ప్లస్ కొత్త ఆందోళన.. తాజా పరిస్థితి ఇదే !!

భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఒకపక్క కేసులు తగ్గుతున్నట్లు కనిపించినా, మరోపక్క డెల్టా ప్లస్ వేరియంట్ భయం ప్రజలను పట్టి పీడిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 50,581 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా కేసుల మార్క్ మూడు కోట్లను దాటింది.

50,581 కొత్త కేసులు ,1,358 కొత్త మరణాలు

50,581 కొత్త కేసులు ,1,358 కొత్త మరణాలు

ఈరోజు నమోదైన కేసులు, నిన్నటి కేసులతో పోల్చుకుంటే 19 శాతం పెరిగినట్లుగా తెలుస్తుంది. కొద్దిపాటి హెచ్చుతగ్గుల మధ్య ఇటీవలకాలంలో కరోనా కేసుల నమోదు కనిపిస్తోంది. నిన్న 50000 దిగువన నమోదైన కేసులు ఈరోజు 50 వేలకు పైగా నమోదయ్యాయి. 1,358 కొత్త మరణాలతో, దేశ మరణాల సంఖ్య 3.9 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం భారత్లో కరోనా యాక్టివ్ కేసులు 6,43,194 గా ఉన్నాయి. యాక్టివ్ కేసులలో ఇది 82 రోజుల్లో కనిష్ట స్థాయి.

 అమెరికా తర్వాత ఇండియానే కేసుల్లో టాప్

అమెరికా తర్వాత ఇండియానే కేసుల్లో టాప్

జాతీయ రికవరీ రేటు 96.56 శాతానికి పెరిగింది.ఇప్పటివరకు కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభణ కొనసాగిస్తున్న అత్యంత ప్రభావితమైన అమెరికా తర్వాత, అంత తీవ్రస్థాయిలో కేసులు నమోదైన దేశం భారత్ కావడం గమనార్హం. క్రియాశీల కేసుల రేటు తాజాగా 2.21 శాతానికి పడిపోయింది .నిన్న ఒక్కరోజే 68 ,817 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం 2.9 కోట్ల మంది కరోనా బారి నుండి బయటపడినట్లుగా తెలుస్తుంది.

దేశంలో మూడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ .. ఆందోళనలో దేశం

దేశంలో మూడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ .. ఆందోళనలో దేశం

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 88.09 లక్షల మోతాదులో కోవిడ్ -19 వ్యాక్సిన్లను సోమవారం రికార్డు స్థాయిలో నమోదు చేసిందని, 64 శాతం టీకాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగాయని పేర్కొంది. ఇదిలా ఉంటే దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కనుగొనబడిన కరోనావైరస్ యొక్క డెల్టా ప్లస్ వేరియంట్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన యొక్క వైవిధ్యంగా వర్గీకరించింది. వేరియంట్ కనుగొనబడిన సమూహాలలో తక్షణ నియంత్రణ చర్యలను చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+