corona in India : భారీగా క్షీణత .. తాజాగా 30 వేల దిగువకు కొత్త కేసులు, 373 మరణాలు
భారతదేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత కొంత కాలంగా కరోనా కేసులలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఇక తాజాగా రోజువారీ కేసులు, మరణాలలో భారీగా క్షీణత కనిపించింది. రోజువారీ కేసులు 30 వేల దిగువకు చేరుకోగా, మరణాలు 400 దిగువకు పడిపోయాయి .ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 28,204 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత దేశంలో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,19,98,158 కి చేరుకుంది.

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,88,508
రోజువారీ మరణాల సంఖ్య 373 గా నమోదయింది. తాజా మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 428,682 కి చేరుకుంది.దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,88,508గా కొనసాగుతుంది. సోమవారం ఒక రోజే 13,680 యాక్టివ్ కేసులు తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కరోనా కారణంగా కోలుకున్నవారు 41,511 మంది .దీంతో ఇప్పటి వరకు మొత్తం రికవరీల సంఖ్య 3,11,80,968 కి చేరుకుంది. అధికారులు దేశవ్యాప్త పరీక్షను వేగవంతం చేస్తున్నందున, సోమవారం నాటికి మొత్తం 48,32,78,545 నమూనాలను కరోనా నేపధ్యంలో పరీక్షించారు . ఇందులో 15,11,313 నమూనాలను ఒక రోజులో పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.

దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఇలా ..
భారతదేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య గత ఏడాది ఆగస్టు 7 న రెండు మిలియన్ మార్కును దాటింది, ఆగస్టు 23 న మూడు మిలియన్లు, సెప్టెంబర్ 5 న నాలుగు మిలియన్లు, సెప్టెంబర్ 16 న ఐదు మిలియన్లు, సెప్టెంబర్ 28 న ఆరు మిలియన్లు, అక్టోబర్ 11 న ఏడు మిలియన్లు, ఎనిమిది మిలియన్లు అక్టోబర్ 29 న, నవంబర్ 20 న తొమ్మిది మిలియన్లు మరియు డిసెంబర్ 19 న 10 మిలియన్లుగా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశం మే 4 న 20 మిలియన్ కేసులు , జూన్ 23 న 30 మిలియన్ల భయంకర మైలురాయిని దాటింది. ఇదిలా ఉంటే భారతదేశం యొక్క కరోనా వ్యాక్సినేషన్ 510 మిలియన్ (513,914,567) మైలురాయిని అధిగమించింది.

రోజువారీ కేసుల్లో టాప్ వన్ లో కేరళ ... తర్వాత స్థానంలో మహారాష్ట్ర
ఇక ఇదే సమయంలో కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభణ కొనసాగుతుంది .గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 13,049 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 105 మంది కరోనా కారణంగా మృతి చెందారు. కేరళలో కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. కేరళ తర్వాత కరోనా కేసులలో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 4505 కరోనా కేసులు నమోదయ్యాయి . గత 24 గంటల 68 మరణాలు నమోదయ్యాయి.
Recommended Video

తర్వాత స్థానాల్లోనూ దక్షిణాది రాష్ట్రాలే
ఇదిలా ఉంటే ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు రాష్ట్రంలో 1229 కొత్త కేసులు నమోదయ్యాయి 23 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది .1413 కేసులతో 18 మరణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. ఐదవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉంది .కర్ణాటకలో గత 24 గంటల్లో 1186 కరోనా కేసులు, 24 మరణాలు సంభవించాయి. ఇక అస్సాం, మిజోరాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనో కరోనా కేసులు అధికంగానే నమోదు అవుతున్నాయి.












Click it and Unblock the Notifications