భారత్ లోకరోనా ఉధృతి : తాజాగా 3,780 మరణాలు, పంజా విసురుతున్న డబుల్ మ్యూటాంట్
భారతదేశాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. నిత్యం లక్షల్లో నమోదవుతున్న కేసులతో భారతదేశం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైద్య వసతుల లేమి భారతదేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దేశవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా రోగుల ఆక్రందనలు ముడుతున్నాయి. దేశవ్యాప్తంగా మరణమృదంగం మోగుతోంది.
Recommended Video
గత 24 గంటల్లో 382,315 కరోనా కొత్త కేసులు
తాజాగా భారతదేశంలో గత 24 గంటల్లో 3,82,315 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 20.66 మిలియన్లు దాటింది. గత 24 గంటల్లో 3,780 కొత్త మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో కలిపి దేశంలోని కోవిడ్ -19 మరణాల సంఖ్య 2,26,188 కు పెరిగింది. ఉదయం 9:15 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాష్‌బోర్డ్ ప్రకారం దేశం యొక్క మొత్తం కేసుల సంఖ్య 2,06,65,148 కు చేరుకుంది.

34,87,229కు చేరిన కరోనా క్రియాశీల కేసులు
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం రెండువారాల నుండి రోజువారీ 3,00,000కు పైగా కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. దాదాపు వారం క్రితం మూడు మిలియన్ల మార్కును దాటిన క్రియాశీల కరోనావైరస్ కేసులు ప్రస్తుతం 34,87,229 వద్ద ఉన్నాయి. దేశంలో మొత్తం ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసులలో ఇది 17%. గత 24 గంటల్లో ఇప్పటివరకు 3,38,439 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు . దీంతో మొత్తం 1,69,51,731 మంది మహమ్మారి బారినుండి కోలుకున్నారు.
నిన్న ఒక్కరోజే ఢిల్లీలో 448 మంది మృత్యువాత
ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశం యొక్క రికవరీ రేటు 81.91% వద్ద ఉంది. దేశంలో ఇప్పటివరకు 16,04,94,188 కోవిడ్ -19 వ్యాక్సిన్లు ఇచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.మరోపక్క దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. నిన్న ఒక్కరోజే ఢిల్లీలో 448 మంది మృత్యువాతపడ్డారు. 400 మందికి పైగా కరోనా బాధితులు నిత్యం ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఢిల్లీ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది.
మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం , 891 మరణాలు, దేశానికి డబుల్ మ్యూటాంట్ భయం
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది .కఠినమైన ఆంక్షలు పెట్టినా మహారాష్ట్ర లో కొత్తగా 891 మరణాలు చోటుచేసుకున్నాయి .గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 51,880 కొత్త కేసులు నమోదయ్యాయి.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా తయారయ్యింది . ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ వైద్య వసతుల లేమి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది . కోవిడ్ డబుల్ మ్యూటాంట్ దక్షినాది రాష్ట్రాల్లో పంజా విసురుతుంది . దేశానికి డబుల్ మ్యూటాంట్ భయం పట్టుకుంది.












Click it and Unblock the Notifications