భారత్ లో కరోనా : కొత్త కేసులలో కాస్త ఊరట ; అయినా కేరళతోనే టెన్షన్ , తాజా కేసులు ఎన్నంటే !!
దేశంలో కరోనా కేసులు విజృంభణ కొనసాగుతూనే ఉంది. కాస్త హెచ్చుతగ్గులతో కరోనా కేసులు నిత్యం నమోదవుతున్నాయి. భారతదేశం గత 24 గంటల్లో 33,376 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. అంతేకాదు నిన్న ఒక్కరోజే 308 కరోనా మరణాలను నివేదించింది. కేసుల సంఖ్య గురువారం 34,973 నుండి స్వల్పంగా తగ్గినప్పటికీ, ఈ వ్యాధి బారిన పడిన క్రియాశీల కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3.91 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల రేటు 1.18 శాతంగా నమోదయింది. గత 24 గంటల్లో 308 మంది మరణించగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 4,42,317గా నమోదయింది. ఒక కేరళ రాష్ట్రంలో 177 మంది నిన్న కరోనా కారణంగా మరణించారు.

3.32 కోట్లను దాటిన మొత్తం కరోనా కేసులు
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15.92 లక్షల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.32 కోట్లను దాటింది. ఇక మరోమారు కొత్త కేసులు కంటే రికవరీ ల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది . నిన్న ఒక్క రోజు కరోనా మహమ్మారి బారినుండి 32,198 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోల్పోయిన వారి సంఖ్య 3.23 కోట్లను దాటింది. ఇక రికవరీ రేటు 97.49 శాతంగా ఉంది. శుక్రవారం 25,010 మంది పాజిటివ్ కేసులు నమోదు చేయడంతో కేరళ రోజువారీ కరోనా కేసులలో అగ్రగామిగా నిలిచింది.

కేరళలో రోజువారీ అత్యధిక కేసులు.. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే
అత్యధిక రోజు వారి కేసులు నమోదు చేస్తున్న కేరళ తర్వాత, కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్ర మహారాష్ట్ర రోజువారి కేసులను అధికంగా నమోదు చేస్తోంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 4184 కరుణ కేసులు నమోదు కాగా, 44 మంది కరోనా మహమ్మారి బలైపోయారు. ఇక ఆ తర్వాత స్థానంలో తమిళనాడు రాష్ట్రంలో 1631 కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కి 177 మంది బలైపోయారు. ఇక నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది 1608 కరోనా కేసులు నమోదు కాగా ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు.

ఇప్పటివరకు దాదాపు 73 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు
ఆ తర్వాత స్థానంలో మిజోరామ్ ఒక 1055 కరోనా కేసులు నమోదు చేసింది. మిజోరాంలో నిన్న ఒక్కరోజే ముగ్గురు మరణించారు. ఇక కర్ణాటక రాష్ట్రంలో 967 కేసులు నమోదు కాగా, పదిమంది కరోనా కారణంగా మృతి చెందారు. భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 73 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు నిర్వహించబడుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దాదాపు 73 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఇక తాజా నివేదిక ప్రకారం శుక్రవారం రాత్రి 7 గంటల వరకు 56 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడ్డాయి.

కరోనాపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
కోవిడ్ -19 నుండి దేశంలోని అత్యంత హాని కలిగించే జనాభా సమూహాలను రక్షించడానికి ఒక సాధనంగా టీకా వ్యాయామం క్రమం తప్పకుండా సమీక్షించబడుతోంది మరియు అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించబడుతోందని కేంద్రం వెల్లడించింది . పిఎం మోడీ అధ్యక్షతన కోవిడ్ పరిస్థితి, టీకాపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితి మరియు దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని పరిశీలించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ కోవిడ్ రెండవ వేవ్ ముప్పుతో భారతదేశం ఇంకా కొట్టుమిట్టాడుతోందని, అది ఇంకా ముగియలేదని చెప్పిన క్రమంలో ఈ సమావేశం జరిగింది.












Click it and Unblock the Notifications