వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లోకరోనా ఉధృతి : గత 24 గంటల్లో 3,68,147 కొత్త కేసులు,3417 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి.నిత్యం కరోనా బారిన పడుతున్నవారితో ఆసుపత్రులలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. మొన్న భారతదేశం రోజువారీ కోవిడ్ ఉప్పెనలో 4 లక్షలకు పైగా కేసులతో భయంకరమైన ప్రపంచ రికార్డును నమోదు చేసింది.ఇక తాజాగా కరోనాకేసులు కాస్త నెమ్మదించి గత 24 గంటల్లో 3.68 లక్షల కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. నిన్నఒక్కరోజు భారతదేశంలో 3,417 మంది మరణించారు.

భారత్ లో కరోనా కట్టడికి లాక్ డౌన్ .. కరోనా సంక్షోభంపై ప్రముఖ వైద్య నిపుణులు ఫౌసీ హెచ్చరిక ఇదేనా ?భారత్ లో కరోనా కట్టడికి లాక్ డౌన్ .. కరోనా సంక్షోభంపై ప్రముఖ వైద్య నిపుణులు ఫౌసీ హెచ్చరిక ఇదేనా ?

దేశంలో మరణాల సంఖ్య మూడు వేలకు పైగా నమోదవుతున్న పరిస్థితులు

దేశంలో మరణాల సంఖ్య మూడు వేలకు పైగా నమోదవుతున్న పరిస్థితులు

నిన్న ఒక్కరోజు నమోదైన కరోనా కేసులు 3,68,147.దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.99 కోట్లకు చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 3,00,732 మంది కరోనా జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1.62 కోట్ల మంది కరోనా నుండి కోలుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రికవరీ రేటు 81.77 శాతంగా ఉంది. ఇక దేశంలో మరణాల సంఖ్య మూడు వేలకు పైగా నమోదవుతున్న పరిస్థితులు భారత దేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశంలో 34 లక్షలను దాటిన క్రియాశీల కేసులు

దేశంలో 34 లక్షలను దాటిన క్రియాశీల కేసులు

తాజాగా 3417 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు .దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 2,18,959గా ఉంది. ఇక దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34 లక్షలను దాటి క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 34,13,642. ఇక క్రియాశీల కేసుల రేటు 17.13 శాతానికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సరఫరా లోటు సరిదిద్దాలని సుప్రీంకోర్టు కేంద్రానికి తెలిపింది. వైద్య ఆక్సిజన్ కొరత జాతీయ రాజధానిలో కోవిడ్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది, ఆసుపత్రులు తీరని విజ్ఞప్తులను - సోషల్ మీడియా ద్వారా నిత్యం పంపిస్తున్నాయి.

కరోనా కట్టడికి హర్యానా,ఒడిశా తాజా ఆంక్షలు

కరోనా కట్టడికి హర్యానా,ఒడిశా తాజా ఆంక్షలు

సామూహిక సమావేశాలు మరియు సూపర్ స్ప్రెడ్ అయ్యే సంఘటనలపై నిషేధం విధించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా కోరుతున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం రెండవ దశలో వైరస్ ను అరికట్టడానికి లాక్డౌన్ విధించడాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హర్యానా, పంజాబ్ మరియు ఒడిశా ఆదివారం కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడానికి తాజా ఆంక్షలను ప్రకటించాయి. హర్యానాలో ఒక వారం కఠినమైన లాక్డౌన్ ప్రకటించగా, ఒడిశా రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది.రైలు,రహదారి,ఆకాశమార్గాల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించేవారికి కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ అవసరమని పంజాబ్ తెలిపింది. సినిమా హాళ్లు, బార్‌లు మరియు వ్యాయామశాలలు మూసి వెయ్యాలని రెస్టారెంట్లలో భోజనానికి అనుమతి లేదని పేర్కొంది.

ఒక్క ఏప్రిల్ నెలలోనే 66 లక్షల కేసులు , 45 వేల మరణాలు

ఒక్క ఏప్రిల్ నెలలోనే 66 లక్షల కేసులు , 45 వేల మరణాలు

కరోనా రెండవ వేవ్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారం మోపింది. ఏప్రిల్‌లో భారతదేశంలో 66 లక్షల తాజా కేసులు నమోదయ్యాయి. మార్చిలో 10.25 లక్షల కేసులు, ఫిబ్రవరిలో 3.5 లక్షలు, జనవరిలో 4.79 లక్షలు నమోదయ్యాయి. మార్చిలో 5,417 మంది మరణించగా, కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో మాత్రమే 45,000 మంది మరణించారు.

English summary
India saw a slight dip in the daily Covid-19 cases on Monday as it registered over 3.68 lakh fresh cases and 3,417 death in the past 24 hours, according to the Union health ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X