• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

corona India update : 2 లక్షలు దాటిన కరోనా కేసులు .. గత 16 రోజుల్లోనే లక్ష కేసులు

|

భారతదేశంలో కరోనావైరస్ కేసులు రెండు లక్షలు దాటాయి. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోని కరోనాకేసుల నమోదులో ఏడో స్థానంలో ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులను బట్టి చూస్తే ఇటలీ,యూ కె,స్పెయిన్ లను పది, పదిహేను రోజుల్లోనే అధిగమించే పరిస్థితి ఉంది. భారతదేశంలో గత 16 రోజుల్లోనే లక్ష కేసులు నమోదయ్యాయి అంటే కేసులు ఏ విధంగా వృద్ధి చెందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పరిస్థితి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెడుతోంది.

పెరుగుతున్న కొత్త కేసులతో భారత్ విలవిల .. గత 24 గంటల్లో 8171 కొత్త కేసులు

 బాగా పెరుగుతున్న కరోనా ఉధృతి

బాగా పెరుగుతున్న కరోనా ఉధృతి

కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గదు.దాంతో సహజీవనం చేయాల్సిందే అని చెప్పిన పరిస్థితి . ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయం వెల్లడించిన నాటినుండి అటు ప్రభుత్వాల, ఇటు ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది.నిదానంగా సాధారణ జీవితానికి అలవాటు కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా లాక్ డౌన్ విధిస్తూనే సడలింపులను అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇక దీంతో కరోనా ఉధృతి బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశంలో రోజువారి కేసుల వృద్ధిరేటును చూసినట్లయితే 4.61గా ఉంది.

దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 2,07,614

దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 2,07,614

ఇక కేసుల రెట్టింపు కు 15.2 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ లెక్క ప్రకారం చూస్తే జూన్ 15 వరకు 3.60 లక్షల కేసులు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది అని ప్రస్తుతం పెరుగుతున్న కేసుల రేటును బట్టి అంచనా వేస్తున్నారు.ఇక దేశంలో మహారాష్ట్ర పరిస్థితి ఏమాత్రం మారలేదు. తాజాగా 2287 కేసులతో మహారాష్ట్రలో కేసులు 72000 దాటాయి. తమిళనాడులో వరుసగా మూడవ రోజు కూడా వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి .ఇక దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య చూస్తే 2,07,614గా ఉంది.యాక్టివ్ కేసులు 1,01,066 కాగా, రికవరీ కేసులు 1, 00,302గా ఉంది.

24 గంటల్లో 8908 మంది కొత్త కేసులు

24 గంటల్లో 8908 మంది కొత్త కేసులు

ఇక ఇప్పటి వరకు కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 5829 గా ఉంది. గత 24 గంటల్లో 8908 మంది కరోనా వైరస్ బారిన పడినట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వరుసగా ప్రతి రోజు ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదవుతున్న తీరు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఇండియా లేదని చెబుతోంది.

ఆందోళన అవసరం లేదంటున్న ఐసీఎంఆర్

ఆందోళన అవసరం లేదంటున్న ఐసీఎంఆర్

ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ నివేద గుప్తా మాట్లాడుతూ భారతదేశం కరోనా కేసుల విషయంలో చాలా దేశాలతో పోలిస్తే బెటర్ గా ఉంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎనిమిది వేల కొత్తకేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ భారతదేశంలో నివారణాచర్యలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటులో చాలా బెటర్ గా ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ఎంత పెరుగుతున్నా రికవరీ కూడా అంతే స్థాయిలో ఉంటుందని డాక్టర్ నివేద గుప్తా చెప్పారు. కాబట్టి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.

English summary
With India reporting 8,908 cases in the last 24 hours, the total number of coronavirus infections in India crossed the 2 lakh-mark to reach 2,07,614 on Wednesday. This includes including 5,829 deaths and 1,00,302 cured/ discharged. As many as 217 people have died in the last 24 hours across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more