వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీ తగ్గుతున్న కరోనా కొత్త కేసులు, మరణాలు; 2.64 లక్షల యాక్టివ్ కేసులు; దేశంలో తాజా లెక్కలివే !!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 20,799 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులు నిన్న నమోదైన కేసులు కంటే 9 శాతం తక్కువగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 180 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసులు 2,64,454 కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.78 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం రికవరీలు 3,31,21, 247. ఇక రికవరీల శాతం 97.89 శాతంగా ఉంది.

నిన్న ఒక్కరోజు కరోనా మృతుల సంఖ్య 180
గత 24 గంటల్లో నమోదైన 180 మరణాలతో కలిపి భారత దేశంలో ప్రస్తుతం మొత్తం మరణాల సంఖ్య 4,48,997. గత 24 గంటల్లో 26,718 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతుంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పంపిణీ అయిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 90,79,32,861. ఇదిలా ఉంటే కరోనా రోజువారీ కేసులను ఎక్కువగా నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో 12,297 తాజా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. 74 మంది మరణించారు. దీంతో కేరళలో మొత్తం కేసులు 47,20,233కి చేరుకున్నాయి. మొత్తం మరణాలు 25,377 కి చేరాయి. మొత్తం రికవరీలు 45,57,199 కి చేరుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,043 కు వచ్చినట్టు సమాచారం.

Corona new cases and deaths declining again .. this is the latest covid 19 data in india

మహారాష్ట్ర, మిజోరాం లలో కరోనా కేసుల ఉధృతి.. తాజా పరిస్థితి ఇదే
మహారాష్ట్రలో 2,692 కొత్త పాజిటివ్ కేసులు మరియు 41 మరణాలు నమోదయ్యాయి. 2,716 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసుల నమోదుతో రాష్ట్రంలోని కోవిడ్-19 సంఖ్య 65,59,349 కి చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా కనీసం 1,39,207 మంది మరణించారని, రాష్ట్రంలో ఇప్పుడు 35,888 యాక్టివ్ కేసులు మిగిలి ఉన్నాయని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో కరోనా కేసుల పెరుగుదలను చూస్తోంది. మిజోరాం రాష్ట్రంలో ఆగస్టులో కనీసం 21,074 కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 34,263 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఏప్రిల్‌లో 1,655, మేలో 6,268, జూన్‌లో 8,093, జూలైలో 18,433 కరోనా కేసులు నమోదయ్యాయి.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసుల పరిస్థితి ఇలా
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలో 1531 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 23 మంది మరణించారు. కర్ణాటక రాష్ట్రంలో 664 కొత్త కేసులు నమోదు కాగా ఎనిమిది మంది మరణించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా 765 కొత్త కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మరణించారు.కరోనా కారణంగా గత 24 గంటల్లో 162కరోనా కేసులు నమోదు కాగా, ఒక్కరు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 33 కరోనా కేసులు నమోదు కాగా జీరో మరణాలు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 701 కరోనా కేసులు నమోదు కాగా, పది మంది మరణించారు.

కరోనా మరణాలు నమోదు కాని రాష్ట్రాలివే
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీతో పాటు చత్తీస్గడ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, అరుణాచల ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, లడక్ లలో ఒక్క కరోనా మరణాలు కూడా నమోదు కాలేదు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.10 శాతంగా ఉంది .ఇక వారాంతపు పాజిటివిటీ రేటు 1.63 శాతంగా ఉంది.

English summary
In the last 24 hours, 20,799 new cases of corona were reported in India. The latest cases are 9 per cent less than yesterday. Yesterday alone, 180 people died due to corona. There are currently 2,64,454 corona active cases in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X