భారత్ లో 8 నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు; 13,058 తాజా కేసులు, 164 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 13,058 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గత ఎనిమిది నెలలుగా అత్యల్ప రోజువారీ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 164 మంది మరణించారు.కొత్తగా నమోదైన మొత్తం కేసులతో కలిపి ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,94,373 గా ఉంది.

రెండు లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి నమోదు చేయబడిన మొత్తం కేసులలో దేశం యొక్క క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం రెండు లక్షలకు దిగువగా కొనసాగుతుంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ క్రియాశీల కేసులు1,83,118 ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసుల శాతం 0.56 శాతంగా ఉంది అని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కేస్‌లోడ్ కూడా 221 రోజుల్లో అతి తక్కువగా నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

Corona new cases for an 8-month minimum in India; 13,058 latest cases, 164 deaths

రోజువారీ కేసుల కంటే రికవరీలే ఎక్కువ

ఇదిలా ఉంటే ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారి నుండి 3,34,58,801 కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా నుండి 19,470 మంది కోలుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజువారి నమోదవుతున్న కొత్త కేసులు కంటే, రోజువారీ రికవరీలో అత్యధికంగా ఉండటం భారతదేశానికి భారీ ఊరటనిస్తుంది. ఇదిలా ఉంటే కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.14 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు, ప్రతి 100 పరీక్షలలో పాజిటివ్ పరీక్షించే వ్యక్తుల సంఖ్యను సూచిస్తుంది, రోజువారీ రోజువారీ పాజిటివిటీ రేటు సోమవారం 1.37 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.36% గా నమోదయింది. గత 49 రోజులుగా ఇది 3 శాతం కంటే తక్కువగా ఉంది.

నిన్న ఒక్కరోజే 11 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు, 87,41,160 వ్యాక్సిన్ డోసులు
గత 24 గంటల్లో దేశంలో 11 లక్షలకు పైగా కోవిడ్ -19 పరీక్షలు జరిగాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మంగళవారం తెలియజేసింది. కరోనా మహమ్మారిని నిర్ధారించడానికి సోమవారం 11,81,314 నమూనాలను పరీక్షించగా, దేశంలో ఇప్పటివరకు 59,31,06,188 కోవిడ్ -19 పరీక్షలు జరిగాయి. మరోపక్క కరోనావ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా 87,41,160 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రోజుల సంఖ్య 98 కోట్ల మార్కును దాటి 100 కోట్లకు చేరువగా ఉంది.

Corona new cases for an 8-month minimum in India; 13,058 latest cases, 164 deaths

ప్రపంచంలో కరోనా పరిస్థితి ఇలా .. దేశంలో కొత్త కేసుల నమోదులో టాప్ 3 రాష్ట్రాలివే
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా, 24 కోట్లకు పైగా కేసులు నమోదు కాగా, 48.98 లక్షల మరణాలు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,676 మంది కరోనా మహమ్మారి బారిన పడగా 60 మంది మరణించారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో 83,250 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలోనే కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రభావితమైన మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1485 కరోనా కేసులు నమోదు కాగా 27 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 28,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 1192 కరోనా కేసులు నమోదు కాగా 13 మంది మరణించారు. రాష్ట్రంలో 14,570 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+