వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కంట్రోల్ లోకి రాని కరోనా .. తీవ్ర నిర్ణయాల దిశగా మహా సర్కార్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా ఏ మాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు. దీంతో తీవ్ర నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది మహా సర్కార్ . ఇక తాజా పరిస్థితి మహా రాష్ట్ర సర్కార్ కు పెద్ద సంకటంగా మారింది. మహారాష్ట్రంలో తాజాగా 35 కొత్త కరోనా బాధితుల మరణాలు సంభవించాయి. ఇక మహా సర్కార్ ఎంత ప్రయత్నం చేసినా కరోనా నియంత్రణ మాత్రం సాధ్యం కావటం లేదు . దీంతో పెరుగుతున్న కేసులు ,పెరుగుతున్న మరణాలతో మహా రాష్ట్రలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది .

యూపీలో కొత్త పరేషాన్ .. కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్యూపీలో కొత్త పరేషాన్ .. కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్

కరోనా మోగిస్తున్న మరణ మృదంగం ... ఒకేరోజు 35 మరణాలు

కరోనా మోగిస్తున్న మరణ మృదంగం ... ఒకేరోజు 35 మరణాలు

ఇటీవల మే 2 న 36 మరణాలు సంభవించాయి. ఇక ఆ తరువాత రెండవ అత్యధిక మరణాలు 35 తాజాగా మహారాష్ట్రలో నమోదు అయ్యాయి . ఇక కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏకంగా 14,541 కి చేరింది . ఇక తాజాగా జరిగిన 35 మరణాలతో, రాష్ట్ర మరణాల సంఖ్య 583 కు పెరిగింది. మొత్తం మరణాలలో, 18 ముంబైలో నమోదయ్యాయి. ఒక్క ధారావి లో తాజాగా 42 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆసియాలో అతిపెద్ద మురికివాడలో మొత్తం ఇప్పటి వరకు 632 కేసులు మరియు 20 మరణాలు సంభవించాయి.

మృతుల్లో చాలా మంది ఇతర దీర్ఘ కాల వ్యాధులతో బాధ పడుతున్న వాళ్ళే

మృతుల్లో చాలా మంది ఇతర దీర్ఘ కాల వ్యాధులతో బాధ పడుతున్న వాళ్ళే

ఇక పూణేలో 7 తాజా మరణాలు, అకోలా 5, మరియు థానే, ఔరంగాబాద్, సోలాపూర్ మరియు నాందేడ్ లలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు సంభవించాయి .మృతుల్లో 22 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారు, వారిలో దాదాపు 70 శాతం మంది మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు మరియు ఉబ్బసం వంటి ఇతర తీవ్రమైన రోగాలతో బాధపడుతున్నారు.

మహారాష్ట్రలో కరోనా నియంత్రణకు కఠినమైన ఆదేశాలు ఇచ్చిన ఉద్ధవ్ సర్కార్

మహారాష్ట్రలో కరోనా నియంత్రణకు కఠినమైన ఆదేశాలు ఇచ్చిన ఉద్ధవ్ సర్కార్

మే చివరి నాటికి మహారాష్ట్రను గ్రీన్ జోన్ గా మార్చాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. గత రెండు నెలల నుండి కరోనా వైరస్ కారణంగా నెలకొన్న సంక్షోభాల కారణంగా సంభవించే భారీ ఆర్థిక నష్టాలను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు తగ్గించే చర్యలను కూడా చేపట్టింది . ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధలను కఠినంగా అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఇక ఇప్పటి వరకు మహారాష్ట్రలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,465 కు చేరుకుంది.

ముంబైలో కఠిన ఆంక్షలు ... మే 17 వరకు 144 సెక్షన్

ముంబైలో కఠిన ఆంక్షలు ... మే 17 వరకు 144 సెక్షన్

ఇక ముంబై నగరంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ ఇక కరోనా కంట్రోల్ చెయ్యటానికి మహా సర్కార్ నిర్ణయం తీసుకుంది . ముంబై నగరంలో మే 17 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించిన మహా ప్రభుత్వం వైద్యం కోసం మినహా మరే ఇతర పనుల కోసం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని పేర్కొంది. నిబంధనలను అతిక్రమించిన వారు ఆరు నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిన్న ఒక్కరోజే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 150 కొత్త కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు .

English summary
Maharashtra recorded 35 new Covid-19 deaths – the second highest toll after 36 on May 2 – and cases continued to increase without respite touching 14,541, health officials said on the first day of lockdown 3.0.With 35 fatalities, the state death toll shot up to 583 and the total number of Coronavirus patients increased to 14,541.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X