వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ దేశం నుండి వచ్చిన కరోనా పేషెంట్ మిస్సింగ్.. వెతుకుతున్న అధికారులు

|
Google Oneindia TeluguNews

అర్జెంటీనా నుండి మన దేశానికి తాజ్ మహల్ ను సందర్శించడానికి వచ్చిన ఒక పర్యాటకుడు కరోనా పాజిటివ్ కు గురయ్యాడు. అయితే అతను అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అతను ఎక్కడున్నాడో కనుక్కోవడం అధికారులకు ఇబ్బందిగా మారింది. సదరు కరోనా పాజిటివ్ రోగి ఇచ్చిన అడ్రస్ లో లేకపోవటంతో అధికారులు అతని కోసం వెతుకుతున్నారు.

చైనా కరోనా కల్లోలానికి కారణం.. ఒకటికాదు నాలుగు కొత్త వేరియంట్లు!!చైనా కరోనా కల్లోలానికి కారణం.. ఒకటికాదు నాలుగు కొత్త వేరియంట్లు!!

ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శించటానికి వచ్చిన సదరు అర్జెంటీనాకు చెందిన పర్యాటకుడిని స్క్రీనింగ్ సమయంలో చేసిన యాంటిజెన్ పరీక్షలో పాజిటివ్ గా గుర్తించారు. దీంతో అతనిని తాజ్ మహల్ ప్రాంగణంలోకి అనుమతించలేదు. ఆ తరువాత అతడి సంప్రదింపు వివరాలను అడగగా అతను తప్పుగా ఇవ్వడంతో అధికారులు అతన్ని వెతికే పనిలో పడ్డారు. డిసెంబర్ 26వ తారీకు కోవిడ్ పాజిటివ్ గా గుర్తించిన అంతర్జాతీయ ప్రయాణికుడిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక అధికారులు, పోలీసులు సదరు వ్యక్తి గురించి సమీప హోటళ్లలో ఆరా తీస్తున్నారు.

 Corona patient from argentina country is missing in agra.. Officials are in search

అంతకు ముందు చైనా నుండి తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి డిసెంబర్ 25వ తేదీన తాజ్ మహల్ వద్ద కొవిడ్-19 నిర్ధారణ అయింది. అతను చైనా నుండి తిరిగి వచ్చిన క్రమంలో అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం లక్నోకి పంపించారు. అతను డిసెంబరు 22వ తేదీన భారతదేశానికి వచ్చారు. 23న ఆగ్రాకు చేరుకున్నారు. ఇక అతను ఎవరెవరిని కలిశారు. ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు అనే వివరాలను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

చైనాతో సహా పలు దేశాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో కూడా కరోనా హెచ్చరికలు జారీ చేసి, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆగ్రా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు మరియు విమానాశ్రయంలో పరీక్షలను వేగవంతం చేశారు. ఇక ఆగ్రాలోని ఆరోగ్య అధికారులు తాజ్ మహల్ తో పాటుగా ఇతర స్మారక చిహ్నాల వద్ద, సందర్శకులను పరీక్షించటం ప్రారంభించారు . వారు తమ దృష్టిని ప్రధానంగా విదేశీ పర్యాటకులపై కేంద్రీకరించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే వారిని లోనికి అనుమతించటం లేదు.

English summary
A tourist who came to our country from Argentina to visit the Taj Mahal has been corona positive. But as he gave false information to the authorities, it became difficult for the authorities to trace his whereabouts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X