కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి - వేలల్లో కొత్త కేసులు..!!

దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. నాలుగు రోజుల తరువాత కేసుల నమోదులో స్పల్పంగా తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా యక్టీవ్ కేసుల సంఖ్య 60 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9111 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 27 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదు కాగా ,5.31లక్షల మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 కారణంగా దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు.

corona

కరోనా పాజిటివ్ కేసుల గుర్తింపులో కొద్ది రోజులు గణనీయంగా సంఖ్య పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ గణంకాల మేరకు 1,08,436 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,111 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226 కి చేరింది. దేశంలో రోజువారి పాజిటివిటీ రేలు 8.40 శాతంగా పేర్కొన్నారు. 27 మరణాలు నమోదు కాగా అందులో గుజరాత్ లో ఆరు, ఉత్తర ప్రదేశ్ లో నలుగురు, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి ముగ్గురు చొప్పున, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, బీహార్ చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఢిల్లీతో పాటుగా మహారాష్ట్రలోనూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

corona

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.13శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,26,522) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కేసులు ఎక్కువగా నమోదువుతున్న రాష్ట్రాలపైన కేంద్ర ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ముందస్తు చర్యలను సూచించింది. వైద్యులు మాత్రం మరో వారం రోజుల పాటు కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత కేసుల సంఖ్య క్రమేణా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+