వణికిస్తున్న కరోనా కేసులు: తాజాగా 16764 కొత్త కేసులు; 1,270 ఒమిక్రాన్ కేసులు.. థర్డ్ వేవ్ దిశగా!!

భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నిన్న 13 వేల పైచిలుకు కేసులు నమోదు కాగా ఈ రోజు భారతదేశంలో 16,764 కరోనా కేసులు నమోదయ్యాయి. 16,764 కొత్త కోవిడ్ కేసులతో, భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 91,361కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 220 మంది మరణించారు. పెరుగుతున్న కేసుల తీరు థర్డ్ వేవ్ దిశగా దేశం ప్రయాణం చేస్తుందన్న అనుమానం కలిగిస్తుంది. దేశం యొక్క ఒమిక్రాన్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,270 కు చేరుకుంది. ఇక తాజాగా కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మొదటి కేసును బీహార్ రాష్ట్రం నివేదించింది.

దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు


కోవిడ్ -19 కేసులు దేశంలో నేడు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 16,700కు పైగా కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇది మునుపటి రోజు సంఖ్య కంటే 27% ఎక్కువ. సోమవారం నుండి రోజువారీ కేసుల సంఖ్య 2.6 రెట్లు పెరిగింది. భారతదేశం అంతటా పరీక్ష సామర్థ్యాన్ని విస్తరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 12,50,837 పరీక్షలు జరిగాయి. భారతదేశం ఇప్పటివరకు మొత్తం 67.78 కోట్ల (67,78,78,255) పరీక్షలను నిర్వహించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ లో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది గత 24 గంటల్లో 7,585 మంది కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్నారు.

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

ఇదిలా ఉండగా, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక రాష్ట్రాలు మరింత కఠినమైన ఆంక్షలు విధించాయి. కరోనావైరస్ కేసుల పెరుగుదల తరువాత మహారాష్ట్ర మరియు కర్ణాటక వంటి రాష్ట్రాలు బహిరంగ సమావేశాలకు హాజరుకావడాన్ని 50కి పరిమితం చేశాయి. గోవా రాత్రిపూట కర్ఫ్యూ విధించనప్పటికీ, రాష్ట్రంలోని ఈవెంట్‌లకు హాజరయ్యే వారికి నెగటివ్ ఆర్ టి పి సి ఆర్ సర్టిఫికెట్ లేదా పూర్తిగా టీకాలు వేసిన సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది.

 ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ .. నో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ .. నో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్


దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎల్లో అలెర్ట్ ప్రకటించిన ఢిల్లీ సర్కార్ తగిన చర్యలు తీసుకుంటుంది. జాతీయ రాజధాని పాఠశాలలు, కళాశాలలు మరియు జిమ్‌లను మూసివేయాలని ఆదేశించింది . రాత్రి 10 గంటల వరకు 50% సామర్థ్యంతో పనిచేసే రెస్టారెంట్లు, పబ్బులు మరియు క్లబ్‌లను మాత్రమే అనుమతించింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కూడా నగరంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎటువంటి ఈవెంట్‌లు లేదా సమావేశాలను అనుమతించబోమని పేర్కొంది.

రోజు రోజుకూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులు

రోజు రోజుకూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులు


భారతదేశంలో బుధవారం 13,154 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 82,402 కాగా, మరణాల సంఖ్య 4,80,860కి చేరుకుంది. గురువారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కి పెరిగింది. ఢిల్లీలో 263 కేసులు మరియు మహారాష్ట్రలో 252 కేసులు నమోదయ్యాయి. 961 కేసులలో, 320 మంది ఒమిక్రాన్ నుండి కోలుకున్నారు. ఇక ఈ రోజు అటు ఒమిక్రాన్ కేసులు , కరోనా కేసులు కూడా విపరీతంగా నమోదయ్యాయి.

286.4 మిలియన్లకు చేరుకున్న గ్లోబల్ కేసులు

286.4 మిలియన్లకు చేరుకున్న గ్లోబల్ కేసులు


ఇదిలా ఉంటే జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య 286.4 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా సంభవించిన మరణాలు 5.42 మిలియన్లకు పైగా ఉండగా టీకాలు 9.09 బిలియన్లకు పెరిగాయి. శుక్రవారం ఉదయం దాని తాజా అప్‌డేట్‌లో, యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSSE) ప్రస్తుత గ్లోబల్ కేసుల సంఖ్య 28,64,33,032 కాగా, మరణాల సంఖ్య 54,28,687గా ఉందని వెల్లడించింది. అయితే మొత్తం వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 909,49,62,455కి పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+