మళ్ళీ కరోనా ఆందోళన; పెరుగుతున్న యాక్టివ్ కేసులు; భారత్ లో తాజా పరిస్థితి ఇదే!!
భారతదేశంలో కరోనా కేసులు తగ్గాయని భావిస్తున్న సమయంలో మళ్లీ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. భారతదేశం, ఏప్రిల్ 14న, 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసులు 10,870 నుండి 11,058కి పెరగడంతో 80 రోజులలో మొదటిసారిగా యాక్టివ్ కోవిడ్-19 కేసులలో పెరుగుదల నమోదైంది. ఈ పరిణామాలు భారతదేశాన్ని అలర్ట్ అంటున్నాయి.

దేశంలో కరోనా తాజా పరిస్థితి ఇదే
భారతదేశంలో గురువారం 1,007 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనావైరస్ మొత్తం కేసులు సంఖ్య 4,30,39,025కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో కనీసం 26 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,21,736 కు చేరుకుంది. మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.

ఢిల్లీ, గుజరాత్, హర్యానాలలో పెరుగుతున్న కరోనా కేసులు
అదే సమయంలో క్రియాశీల కోవిడ్-19 కేసుల పెరుగుదల, కొత్త కేసుల పెరుగుదల కు ఢిల్లీ, గుజరాత్ మరియు హర్యానాలో పెరిగిన కరోనా కేసులు కారణంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లోని అనేక ఆసుపత్రులలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ, ఎక్కువ మంది రోగులు జ్వరం, జలుబు మరియు దగ్గుతో స్వల్పంగా రోగలక్షణాలు కలిగి ఉన్నారని మరియు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వారు చెప్పారు. మొత్తంమీద, భారతదేశంలోని 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసుల పెరుగుదలను నివేదించాయి.

దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు
రోజువారీ పరీక్ష పాజిటివిటీ రేట్లు మిజోరాంలో 10.47 శాతం, హర్యానాలో 3.05 శాతం, నాగాలాండ్‌లో 2.63 శాతం మరియు ఢిల్లీలో 2.49 శాతంగా నమోదయ్యాయి. అలాగే, దేశంలోని 27 జిల్లాలు వీక్లీ టెస్ట్ పాజిటివిటీ రేట్లు 5 శాతానికి పైగా ఉన్నాయి. వీటిలో కేరళలోని 23 జిల్లాలు ఉన్నాయి. అధిక సంఖ్యలో ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే ఏదైనా కొత్త కరోనా వేరియంట్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా INSACOG- ప్రభుత్వం యొక్క కరోనా జన్యు నిఘా కార్యక్రమం నుండి ఇంకా నిర్ధారణ లేనప్పటికీ, కరోనావైరస్ యొక్క పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఓమిక్రాన్ సబ్ వేరియంట్ ల కాంబినేషన్ XE వేరియంట్ పై ఆందోళన
భారతదేశంలోని ఓమిక్రాన్ BA.1 మరియు BA.2 సబ్-వేరియంట్‌ల రీకాంబినెంట్ XE వేరియంట్ ఉనికిని ఇంకా ధృవీకరించలేదు. అయితే కొన్ని రాష్ట్రాలు కొన్ని అనుమానిత కేసులను నివేదించాయి. ఇక యూకే వంటి దేశాలు తాజాగా కరోనా XE వేరియంట్ కేసులను చూస్తున్నాయి. ప్రధానంగా ఈ వేరియంట్ కారణంగా కేసుల పెరుగుదల కనిపిస్తుందన్న భావన ఉంది. భారతదేశం, జనవరి 23 న, ఓమిక్రాన్ వేవ్ యొక్క గరిష్ట సమయంలో 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులను నమోదు చేసింది. అయితే దేశంలో అప్పటి నుండి యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుతోంది.

కరోనా వేరియంట్ లపై అలెర్ట్ అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా కొన్ని దేశాల్లో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదని, కరోనా కొత్త వేరియంట్లు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రమాకరమైన వైరస్ వేరియంట్లను చూసే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అన్ని దేశాలు కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications