వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంచుకొస్తున్న ముప్పు : కరోనా థర్డ్ వేవ్ అనివార్యం, 6 నుండి 8 వారాలలోనే : ఎయిమ్స్ చీఫ్ గులేరియా

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో మరో ముప్పు ముంచుకొస్తోంది .కరోనా థర్డ్ వేవ్ "అనివార్యం" అని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా షాకింగ్ విషయం వెల్లడించారు. రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని తాకవచ్చని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కఠినమైన ఆంక్షల తర్వాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేసుల తగ్గుదలతో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే దేశం యొక్క ప్రధాన సవాలు భారీ జనాభాకు టీకాలు వేయడం అని ఆయన పేర్కొన్నారు.

Recommended Video

COVID Third Wave : వేగంగా వ్యాప్తి, కొత్త డెల్టా-ప్లస్ వేరియంట్.. 6 To 8 Weeks : AIIMS Chief

ఇండియాలో క్షీణిస్తున్న కరోనా కొత్త కేసులు, మరణాలు .. 7లక్షలకు యాక్టివ్ కేసులుఇండియాలో క్షీణిస్తున్న కరోనా కొత్త కేసులు, మరణాలు .. 7లక్షలకు యాక్టివ్ కేసులు

 వైరస్ మ్యూటేషన్ పై మరింత అధ్యయనం చెయ్యాల్సిన అవసరం

వైరస్ మ్యూటేషన్ పై మరింత అధ్యయనం చెయ్యాల్సిన అవసరం

కోవిషీల్డ్ కోసం మోతాదు అంతరాల పెరుగుదల ఎక్కువ మందికి రక్షణ కల్పించడానికి తప్ప అందులో తప్పు లేదని ఆయన వివరించారు. వైరస్ యొక్క మ్యుటేషన్ గురించి మరింత అధ్యయనం చేయడానికి కోవిడ్‌కు వ్యతిరేకంగా భారతదేశ పోరాటంలో మరింత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. డాక్టర్ గులేరియా కొత్త డెల్టా-ప్లస్ వేరియంట్ గురించి చెప్తూ ఇది డెల్టా వేరియంట్ నుండి ఉద్భవించిందని వెల్లడించారు.

 6 నుండి 8 వారాల్లో థర్డ్ వేవ్ ముప్పు

6 నుండి 8 వారాల్లో థర్డ్ వేవ్ ముప్పు

దేశంలో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి,మళ్లీ కరోనా నిబంధనలను పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రజల్లో అప్రమత్తత లేదని, గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని ఆయన వెల్లడించారు. అయితే వచ్చే 6 నుండి 8 వారాల్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని డాక్టర్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ నుండి తప్పించుకోవాలంటే కోవిడ్ తగిన ప్రవర్తనతో పాటుగా, సమూహాలుగా తిరగడాన్ని నివారించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సాధారణంగా కొత్త వేవ్ కు మూడు నెలలు కానీ

సాధారణంగా కొత్త వేవ్ కు మూడు నెలలు కానీ

కరోనా కొత్త వేరియంట్ పరివర్తన చెందుతోందని, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం దేశానికి పెద్ద ప్రధాన సవాలుగా మారిందని గులేరియా వెల్లడించారు. కొత్త తరంగం సాధారణంగా మూడు నెలల సమయం పడుతుంది, అయితే ఇది వివిధ అంశాలపై ఆధారపడి తక్కువ సమయంలో కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరగాలని ఎయిడ్స్ చీఫ్ రణదీప్ గులేరియా వెల్లడించారు.

కరోనా వేవ్స్ మధ్య తగ్గుతున్న అంతరం .. ఆందోళన కలిగించే అంశం

కరోనా వేవ్స్ మధ్య తగ్గుతున్న అంతరం .. ఆందోళన కలిగించే అంశం

ఇప్పుడు థర్డ్ వేవ్ ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్‌డమ్‌లో డెల్టా వేరియంట్ వ్యాప్తిపై మాట్లాడిన రణదీప్ గులేరియా "వైరస్ ఇప్పటికీ పరివర్తన చెందుతోంది, కనుక మనం జాగ్రత్తగా ఉండాలి అని స్పష్టం చేశారు
భారతదేశంలో మొదట గుర్తించిన అత్యంత ట్రాన్స్మిసిబుల్ వేరియంట్ ఇప్పుడు యూకె లోని మొత్తం కరోనా కేసులలో 99 శాతం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త తరంగాల మధ్య అంతరం తగ్గిపోతోందని ఇది "ఆందోళన కలిగించేది" అని డాక్టర్ గులేరియా చెప్పారు.

మూడో వేవ్ కు వ్యతిరేకంగా సన్నాహాలు .. ప్రజలు అలెర్ట్ గా ఉండాలి

మూడో వేవ్ కు వ్యతిరేకంగా సన్నాహాలు .. ప్రజలు అలెర్ట్ గా ఉండాలి

మొదటి వేవ్ సమయంలో, వైరస్ అంత వేగంగా వ్యాపించలేదు ... రెండవ వేవ్ సమయంలో అన్నీ మారిపోయాయి. వైరస్ మరింత ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ . వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎయిమ్స్ చీఫ్ గులేరియా తెలిపారు. ఏదేమైనా మూడో వేవ్ కు వ్యతిరేకంగా సన్నాహాలు జరుగుతున్నాయని, ఇదే సమయంలో ప్రజల సహకారం కూడా ఉండాలని, సామాజిక దూర నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని ఆయన నొక్కి చెప్పారు.

English summary
A third Covid wave in India is "inevitable", and it may hit the country in the next six to eight weeks, AIIMS chief Dr Randeep Guleria told. The gap between the new waves is shortening and it's "worrying", Dr Guleria said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X