అయోధ్యలో మందిర నిర్మాణంతో కరోనా వైరస్ నిర్మూలన: బీజేపీ ఎంపీ మీనా సంచలన వ్యాఖ్యలు..
బీజేపీ ఎంపీ జస్‌కౌర్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరిం నిర్మించిన తర్వాతనే కరోనా వైరస్ సమూలంగా నిర్మూలన జరుగుతోందన్నారు. మీనా.. రాజస్తాన్‌లో దౌసా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైరస్ నిర్మూలనకు అయోధ్యలో మందిరం నిర్మాణం ఒక్కటే పరిష్కారం అని నొక్కి వక్కనించారు. ఆధ్యాత్మిక శక్తులను నమ్మే విశ్వాసనీయులం, అనుచరులందరూ.. కూడా తనతో ఏకీభవిస్తారని తెలిపారు.
మీనా వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే అంతకుముందు మరో బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ కూడా ఇలానే కామెంట్లు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగాకే దేశంలో వైరస్ అంతమొందుతుందని చెప్పారు. ఆ తర్వాత మీనా కూడా మందిరానికి, వైరస్‌కు లింక్ పెడుతూ కామెంట్లు చేశారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్ట్ 5వ తేదీన భూమి పూజ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కరోనా వైరస్ వల్ల 200 మంది అతిథులకే మాత్రమే భూమి పూజలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నారు. వాస్తవానికి భూమి పూజ ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ పెరగడం, లాక్ డౌన్ వల్ల అదీ ఆగస్ట్ 5వ తేదీన నిర్వహించబోతున్నారు.
Recommended Video
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications