హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: 80 శాతం కేసులు ఆ 10 రాష్ట్రాల్లోనే, అక్కడ ఒక్కరు కూడా ?, హే భగవాన్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) సెకండ్ వేవ్ తో ప్రజలు హడలిపోతున్నారు. గత 24 గంటల్లో భారతదేశంలో 2,17,353 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలో 10 రాష్ట్రాల్లోనే 80 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇదే సమయంలో కరోనా వ్యాధితో ఒక్కరు కూడా చనిపోని రాష్ట్రాలు, ప్రాంతాల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ 10 రాష్ట్రాల పేర్లు బయటకు వచ్చిన తరువాత అక్కడి ప్రజలు హే భగవాన్ అంటున్నారు.

Actress: హీరోయిన్ రెండో మొగుడు ఎస్ఐ, కేసు పెట్టిన రాధా, చెత్త క్యారెక్టర్ అంటూ రివర్స్ కేసు!Actress: హీరోయిన్ రెండో మొగుడు ఎస్ఐ, కేసు పెట్టిన రాధా, చెత్త క్యారెక్టర్ అంటూ రివర్స్ కేసు!

 ఈ ప్రాంతాల్లో కరోనాతో ఒక్కరు కూడా !

ఈ ప్రాంతాల్లో కరోనాతో ఒక్కరు కూడా !

గత 24 గంటల్లో దేశంలో 2 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అనేక మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే లడఖ్, త్రిపుర, మేఘాలయా, సిక్కిం, నాగాల్యాండ్, మిజోరం, మణిపుర, లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవుల్లో ఒక్కరు కూడా కరోనా వైరస్ వ్యాధితో మరణించలేదని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

10 రాష్ట్రాలో కరోనా భరతనాట్యం

10 రాష్ట్రాలో కరోనా భరతనాట్యం


భారతదేశంలో గత 24 గంటల్లో 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో 79,10 శాతం కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

యాక్టీవ్ కేసుల్లో రికార్డు బ్రేక్

యాక్టీవ్ కేసుల్లో రికార్డు బ్రేక్

భారతదేశంలోని కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసుల్లో 65.86 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ ఘడ్, ఉత్తరప్రదేశ్, కేరళలో ఉన్నాయని వెలుగు చూసింది. వీటిలో 39. 60 శాతం కరోనా యాక్టీవ్ కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర దెబ్బతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయని అధికారులు అంటున్నారు.

మరణాల్లో ఈ రాష్ట్రాలు ఫస్ట్

మరణాల్లో ఈ రాష్ట్రాలు ఫస్ట్

కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్ మరణాల సంఖ్య కూడా ఈ 10 రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. దేశంలో నమోదైన కోవిడ్ మరణాల సంఖ్యలో ఈ 10 రాష్ట్రాల్లోనే 85.40 శాతం మరణాలు నమోదైనాయని అధికారులు అంటున్నారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో కోవిడ్ మహమ్మారి దెబ్బతో 349 మంది చనిపోయారని, చత్తీస్ ఘడ్ లో 135 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

 సెకండ్ వేవ్ తో సెగలు

సెకండ్ వేవ్ తో సెగలు

దేశవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రజలకు కోవిడ్ వ్యాధి నివారించడానికి కరోనా వ్యాక్సిన్ లు వేస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు హడలిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో కరోనా పంజా విసరడంతో సామాన్య ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటే గత ఏడాది లాగానే భయంతో వనికిపోతున్నారు.

English summary
Coronavirus: Ten states comprising Maharashtra, Uttar Pradesh, Delhi, Chhattisgarh, Karnataka, Madhya Pradesh, Gujarat, Kerala, Tamil Nadu, and West Bengal have shown a steep rise in daily new COVID-19 cases accounting for 79.10 percent of the new infections, the Union Health Ministry said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X