కరోనా రక్కసి ముందు ఓడిన చిన్నారి, వైరస్ బారినపడి 14 నెలల బాలుడి మృతి, క్వారంటైన్‌లో పేరంట్స్..
వైరస్ రక్కసి చిన్నారిని బలి తీసుకుంది. అభం శుభం తెలియని 14 నెలల బాలుడి ఊపిరితీసింది. ఆ నిరుపేద కూలీ దంపతులకు కడుపుకోత మిగిల్చింది. గుజరాత్‌లో పసికందు కరోనా వైరస్‌తో చనిపోయాడని వైద్యులు తెలిపారు. బాలుడి పేరెంట్స్ కూలీలు.. వారు విదేశాలకు కూడా వెళ్లలేదు. చిన్నారికి వైరస్ ఎలా సోకిందో తెలియడం లేదు.

ఉపాధి కోసం..
ఉత్తరప్రదేశ్‌కి చెందిన దంపతులు పొట్ట కూటికోసం గుజరాత్ చేరుకున్నారు. జామ్‌నగర్ సమీపంలో గల దారెద్ గ్రామంలో పనిచేస్తూ గడుపుతున్నారు. వీరికి 14 నెలల బాలుడు కూడా ఉన్నాడు. చిన్నారికి కరోనా వైరస్ రక్కసి సోకింది. అతనిని ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే.. క్రిటికల్ స్టేజీకి చేరింది. ఈ నెల 5వ తేదీన జామ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సిచుయేషన్ సీరియస్‌గా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందించారు.

వెంటిలేటర్‌పై చికిత్స..
వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే అప్పటికే వైరస్ లాస్ట్ స్టేజీకి చేరింది. దీంతో మంగళవారం సాయంత్రం బాలుడి కీలక అవయవాలు పనిచేయలేదు. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్‌తో అతను చనిపోయాడు. అయితే బాలుడి తల్లిదండ్రులది రెక్కాడితే కానీ డొక్కడని పరిస్థితి. విదేశాలకు కూడా వెళ్లలేదు. మరి అతనికి వైరస్ ఎలా సోకిందో అర్థం కావడం లేదు.

16కు చేరిన మృతుల సంఖ్య..
బాలుడి మృతితో గుజరాత్‌లో కరోనా వైరస్ మృతుల సంఖ్య 16కి చేరింది. వీరిలో బాలుడే అత్యంత చిన్న వయస్సు గలవారు. బాలుడికి వైరస్ ఎలా సోకిందో కనుక్కొనే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అతని తల్లిదండ్రులను క్వారంటైన్‌లో ఉంచారు. వాస్తవానికి వారికి కరోనా వైరస్ లక్షణాలు లేవు.. కానీ ముందుజాగ్రత్త చర్యగా చర్యలు తీసుకున్నారు.
Recommended Video

10 నెలల చిన్నారి..
మరోవైపు కరోనా వైరస్ బారినపడ్డ 10 నెలల చిన్నారి కోలుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని కొయంబత్తూరు ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి బాలుడిని సోమవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. బాలుడు కేవలం 8 రోజుల్లోనే వైరస్‌ను జయించారు. అతని గురించి గొప్పగా చర్చించుకుంటున్న సమయంలో గుజరాత్‌లో 14 నెలల బాలుడు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications