Coronavirus: నగ్న వీడియోతో బ్లాక్ మెయిల్, హైటెక్ వ్యభిచారం, కరోనాతో 25 మంది, పోలీసులు !
చెన్నై/ సేలం: భర్తలు చనిపోయిన మహిళల నగ్న వీడియోలు, ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి వారితో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారు. ఇంత కాలం వీరి అరాచకాలను ఓపికతో భరించిన మహిళలు ఈ ముఠా గుట్టు బయటపెట్టింది. మహిళలను బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచారం చేయిస్లున్న ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు అయిన నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిందితులను పట్టుకున్న పోలీసులతో సహ మొత్తం 25 మంది ఇప్పుడు కరోనా క్వారంటైన్ లో ఉన్నారు.

హైటెక్ వ్యభిచారం
తమిళనాడులోని సేలంలోని దాదాకాపట్టి ప్రాంతానికి చెందిన రఘరామన్ ( 52) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడు లోకనాథన్ (35). లోకనాథన్ బార్య రూపా (30). ఎలాంటి కష్టం లేకుండా ఉద్దరగా డబ్బులు సంపాధించడానికి వీరు అమ్మాయిలు, వివాహిత మహిళలతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారు.

భర్తలు చనిపోయిన మహిళలు టార్గెట్
భర్తలు చనిపోయిన మహిళలను లోకనాథన్, రూపా దంపతులు టార్గెట్ చేసుకున్నారు. అయితే భర్తలు చనిపోయినా వారు వ్యభిచారం చెయ్యడానికి అంగీకరించకపోవడంతో వారితో ఎలాగైనా వ్యభిచార కూపంలోకి దింపాలని ప్లాన్ చేశారు. అందుకు మామ రఘునాథన్, భర్త లోకనాథన్ కు రూపా సహకరించింది.

నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్
వ్యభిచారం చెయ్యడానికి నిరాకరించిన మహిళలకు ఏదోఒక విధంగా రూపా దగ్గర అవుతోంది. తరువాత ఆ మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో, బట్టలు మార్చుకుంటున్న సమయంలో నగ్న వీడియోలు, ఫోటోలు తీశారు. తరువాత మేము చెప్పినట్లు హైటెక్ వ్యభిచారం చెయ్యకపోతే మీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, అప్పుడు మీతో పాటు మీ కుటుంబం పరువు మొత్తం బజారులో పడుతోందని ఆ మహిళలను వీరు బెదిరించారు.

భారీదందా, ఉద్దరగా రూ. లక్షలు
అమ్మాయిలు, వివాహిత మహిళలతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న రఘరామన్, అతని కొడుకు లోకనాథన్, కోడలు రూపా ఉద్దరగా లక్షల రూపాయలు సంపాధించారు. ఇదే సమమంలో మీరు ఈ విషయం బయటకు చెబితే మీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని అమ్మాయిలు, మహిళలను బెదిరించారు. ఇంతకాలం వీరి అరాచకాలు చూసి ఓపికగా ఉన్న కొందరు మహిళలు చివరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హైటెక్ ముఠా అరెస్టు
మహిళలు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కాప్లాన్ తో లోకనాథన్, అతని స్నేహితులు ప్రదీప్ (32), శివ (36) అనే ముగ్గురిని అరెస్టు చేశారు. హైటెక్ ముఠా సభ్యులకు సహకరించిన లోకనాథన్ తండ్రి రఘురామన్, అతని కోడలు రూపా తప్పించుకుని పారిపోవడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Recommended Video

కరోనా కాటుకు క్వారంటైన్ లో 25 మంది
హైటెక్ ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు వారికి వైద్యపరీక్షలు చేయించారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ దెబ్బతో నిందితులను అరెస్టు చేసిన పోలీసులతో పాటు వారితో సన్నిహితంగా ఉన్న మొత్తం 25 మందిని ప్రస్తుతం కరోనా క్వారంటైన్ కు తరలించారు. ఇదే సమయంలో నిందితుల అరెస్టు చేసి సెల్ లో పెట్టిన పోలీస్ స్టేషన్ మొత్తం మూసివేసి శానిటైజర్ తో శుభ్రం చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులకు ఇప్పుడు కరోనా టెన్షన్ మొదలైయ్యింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications