చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: అమ్మా క్యాంటిన్ ఉద్యోగికి కరోనా పాజిటివ్, హడల్, ఇప్పటికే పాలు అమ్మిన వ్యక్తి !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన సమయంలో తమిళనాడు ప్రభుత్వం పేదలకు ఆహారం అందిస్తున్న అమ్మా క్యాంటిన్ లో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. అమ్మా క్యాంటిన్ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని వెలుగు చూడటంతో ఆ క్యాంటిల్ లో ఆహారం సేవించిన వారితో పాటు ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే అవీన్ పాలు విక్రయించే సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని తెలుసుకున్న చెన్నై ప్రజలు ఇప్పుడు కరోనా భయంతో హడలిపోతున్నారు.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

చెన్నైలో చాపకింద నీరులా కరోనా వైరస్

చెన్నైలో చాపకింద నీరులా కరోనా వైరస్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరించడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. చెన్నైలో కరోనా వైరస్ వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. అయితే చెన్నైలో కరోనా వైరస్ కేసులు ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి.

అమ్మా క్యాంటిన్ మహిళా ఉద్యోగికి కరోనా !

అమ్మా క్యాంటిన్ మహిళా ఉద్యోగికి కరోనా !

చెన్నై సిటీలోని గజపతిలాల్ వీధి కరోనా కంటైన్ మెంట్ జోన్ లో ఉంది. ఈ గజపతిలాల్ వీధిలో పేదల ఆకలి తీర్చడానికి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మా క్యాంటిన్ ఉంది. గజపతిలాల్ వీధిలోని అమ్మా క్యాంటిన్ లో పని చేస్తున్న 52 ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది.

ఫ్యామిలీకి, ఉద్యోగులకు కరోనా పరీక్షలు

ఫ్యామిలీకి, ఉద్యోగులకు కరోనా పరీక్షలు

అమ్మా క్యాంటిన్ లో పని చేస్తున్న మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆమెతో కలిసి పని చేస్తున్న సిబ్బందికి, ఆమె కుటుంబ సభ్యులు అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించామని వైద్య శాఖ అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఇన్ని రోజులు ఎవరెవరు టచ్ లో ఉన్నారు ? అని పూర్తి సమాచారం సేకరిస్తున్నామని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు.

పాలు విక్రయిస్తున్న వ్యక్తికి కరోనా ?

పాలు విక్రయిస్తున్న వ్యక్తికి కరోనా ?

చెన్నైలోని మాధవరం ప్రాంతంలో అవీన్ పాలు విక్రయిస్తున్న వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో అక్కడ పాలు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురైనారు. అయితే పాల కేంద్రం నుంచి ఎవ్వరికీ కరోనా వైరస్ సోకలేదని, పాలు విక్రయించిన వ్యక్తికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించామని అధికారులు అంటున్నారు. అవీన్ పాల కేంద్రంలో పాలు తీసుకున్న వారు, అమ్మా క్యాంటిన్ లో భోజనం చేసిన వారు ఇప్పుడు ఎక్కడ మాకు కరోనా వైరస్ సోకుతుందో ? అనే భయంతో హడలిపోతున్నారు.

English summary
Coronavirus: Aavin plant and Amma canteen staff hit by Coronavirus in Chennai in Tamil Nadu. An employee of Aavin’s Madhavaram plant and a staff member of the government’s heavily susbidised eatery have tested positive for Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X