బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కేటుగాళ్లకే పోటుగాళ్లు, కరోనా పరీక్షలు, పక్కింటోళ్ల ఫోన్ నెంబర్లు, 4, 500 మంది ఎస్కేప్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ తిరుపతి / చెన్నై: ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో BBMP అధికారులకు అసలు తలనొప్పి మొదలైయ్యింది. బెంగళూరు సిటీలో తప్పుడు అడ్రస్ లు, పక్కింటోళ్ల ఫోన్ నెంబర్లు ఇచ్చి కరోనా పరీక్షలు చేసుకున్న 4, 500 మంది మాయం అయ్యారు. ఇప్పుడు వారికి కరోనా పాజిటివ్ ? అని వెలుగు చూస్తే వారిని ఎక్కడ వెతికి పట్టుకోవాలి, వారు విచ్చలవిడిగా సంచరించి ఇతరులకు వైరస్ అంటిస్తే బెంగళూరు పరిస్థితి ఏమిటి ? అని బీబీఎంపీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

 బెంగళూరులో 40 వేల మార్క్ క్రాస్

బెంగళూరులో 40 వేల మార్క్ క్రాస్

సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల మార్క్ దాటింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) పరిధిలోని 198 వార్డుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరికి వైద్యపరీక్షలు చేశారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ అని వెలుగు చూస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వారు నివాసం ఉంటున్న ఇంటిని, ఆ చుట్టుపక్కల ఇళ్ల ను సీల్ డౌన్ చేస్తున్నారు.

 కేటుగాళ్లకే పోటుగాళ్లు

కేటుగాళ్లకే పోటుగాళ్లు

బెంగళూరులో ఇప్పటి వరకు కరోనా వైరస్ పరీక్షలు చేసుకున్న వారి అడ్రస్ లు, ఫోన్ నెంబర్లను అధికారులు పరిశీలించారు. కరోనా వైరస్ పరీక్ష్లలు చేయించుకున్న వారిలో ఏకంగా 4, 500 మందికి పైగా బెంగళూరులోని వివిద ప్రాంతాల నకిలీ చిరునామాలు, తప్పుడు ఫోన్ నెంబర్లు, పక్కింటోళ్ల ఫోన్ నెంబర్లు ఇచ్చారని బీబీఎంపీ అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది.

 ఎక్కడ ఉన్నారు ? ఏవరి కొంప ముంచుతారు

ఎక్కడ ఉన్నారు ? ఏవరి కొంప ముంచుతారు

కరోనా పరీక్షలు చేయించుకున్న వారిలో కొన్ని వేల మంది నకిలీ చిరునామాలు ఇచ్చారని తెలుసుకున్న అధికారులు హడలిపోయారు. ఈ 4, 500 మందిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని వెలుగు చూస్తే వారిని ఎక్కడ వెతకాలి ? వారు ఏ ఫోన్ నెంబర్ లో అందుబాటులో ఉంటారు ? వారు ఎక్కడెక్కడ తిరిగారు ?, ఎంతమందిని కలిశారు ? అనే వివరాలు సేకరించడం సాధ్యాం కాదని బీబీఎంపీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

 క్వారంటైన భయం !

క్వారంటైన భయం !

బెంగళూరు సిటీలో ప్రతిరోజు సరాసరి 2 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బీబీఎంపీ అధికారులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమకు ఎక్కడైనా కరోనా పాజిటివ్ అని తెలిస్తే పట్టుకెళ్లి క్వారంటైన్ లో పెడతారనే భయంతో చాలా మంది తప్పుడు అడ్రస్ లు, పక్కింటోళ్ల ఫోన్ నెంబర్లు ఇచ్చారని బీబీఎంపీ అధికారులు అంటున్నారు.

 పొరుగు రాష్ట్రాలకు ఎస్కేప్

పొరుగు రాష్ట్రాలకు ఎస్కేప్

కొంత మంది శ్రీమంతులు వారి కారు డ్రైవర్ల ఫోన్ నెంబర్లు, తెలిసిన వారి ఫోన్ నెంబర్లు ఇచ్చి కరోనా వైద్య పరీక్షలు చేయించుకుని మాయం అయ్యారని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. చాల మంది కర్ణాటకను దాటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెక్కేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Fact Check : No Lockdown In Vijayawada - Collector || Oneindia Telugu
 ఇక లాభం లేదు, వాళ్లే కరెక్ట్

ఇక లాభం లేదు, వాళ్లే కరెక్ట్

బెంగళూరు సిటీలో సుమారు 4, 500 మందికి పైగా నకిలీ చిరునామాలు, ఫోన్ నెంబర్లు ఇచ్చి కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలుసుకున్న బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ సీరియస్ అయ్యారు. నకిలీ అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు ఇచ్చి మాయం అయిన వారిని పట్టుకోవడానికి బెంగళూరు సిటీలో డీసీపీ ఆధ్వరంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నారు. తప్పుడు అడ్రస్ లతో కోవిడ్ 19 పరీక్షలు చేసుకుకుని మాయం అయిన మాయగాళ్లకే మాయగాళ్లు, కేటుగాళ్లకే కేటుగాళ్లు అయిన వారి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Coronavirus: The Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) searching for 4,500 people who registered fake address and mobile number during the COVID - 19 test in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X