బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కాషాయం దెబ్బకు కరోనా పరుగో పరుగు, అమ్మతోడు.... ఒక్కకేసు లేదంట, నిజం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి కోవ్యాక్సిన్ డ్రైవ్ వేగవంతంగా సాగుతోంది. కరోనా వైరస్ ను అంతం చెయ్యడానికి ఆయుర్వేదిక్ ఔషదాలు అంటూ పలువురు మందు ఇస్తున్నారు. అయితే వందల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ ను అరికట్టడానికి కాషాయం తెరమీదకు తెచ్చారు. వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న సెంట్రల్ జైల్లో మా ఔషదంతో అందరికి వ్యాధి నయం అయిపోయిందని, అమ్మతోడు ఇప్పుడు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని సెంట్రల్ జైలు అధికారులు అంటున్నారు. మా కాషాయం దెబ్బతో కరోనా పరుగో పరుగు అంటోందని ఖైదీలు చెబుతున్నారని, ఈ సూత్రాన్ని మిగిలిన జైళ్లలో ఫాలో అవ్వాలని సెంట్రల్ జైలు అధికారులు అంటున్నారు.

Illegal affair: భర్తకు బత్తాయి, ప్రియుడికి పనసపండు, ఇనుపరాడ్లు, కత్తులతో భర్తను లేపేసింది !Illegal affair: భర్తకు బత్తాయి, ప్రియుడికి పనసపండు, ఇనుపరాడ్లు, కత్తులతో భర్తను లేపేసింది !

 సెంట్రల్ జైలు పేరు పవర్ ఫుల్

సెంట్రల్ జైలు పేరు పవర్ ఫుల్

ఐటీ హబ్ బెంగళూరు నగర శివార్లలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఉంది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చాలా మంది వీఐపీలు, సినీ నటీనటులు, ప్రముఖులు విచారణ ఖైదీలుగా శిక్ష అనుభించారు. పలువురు వీఐపీలు సైతం ఇదే పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదల అయ్యారు. కొందరు ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తూనే ప్రాణాలు వదిలేశారు.

 వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు

వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కొన్ని వేల మంది ఖైదీలు, విచారణ ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కూడా కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం చూపించింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో పరిమితి సంఖ్య కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉండటంతో కొన్ని నెలల క్రితం వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

 హోమ్ మంత్రి ఎంట్రి

హోమ్ మంత్రి ఎంట్రి

పర్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ విచ్చలవిడిగా వ్యాపించడంతో కర్ణాటక హోమ్ శాఖా మంత్రి బసవరాజ్ బోమ్మయ్ సైతం జైలుకు వెళ్లి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కరోనా వైరస్ ను అరికట్టి ఖైదీల ప్రాణాలు కాపాడాలని హోమ్ మంత్రి సెంట్రల్ జైలు అధికారులకు సూచించారు.

కాషాయం.... ఎనర్జీ బూస్ట్ హెర్బల్ ఎఫెక్ట్

కాషాయం.... ఎనర్జీ బూస్ట్ హెర్బల్ ఎఫెక్ట్


పరప్పన అగ్రహార సెంట్రల్ ల్లోకి కొత్తగా ఎవరైన ఖైదీలు వెళితే కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ పెట్టారు. కరోనా పాజిటివ్ అని వచ్చిన ఖైదీలను వేరే సెల్ కు, నెగటివ్ వచ్చిన వాళ్లు సాధారణ ఖైదీలు ఉండే బ్యారెక్ లకు పంపించారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ప్రతిఒక్కరికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా కాషాయం ఇస్తున్నారు. ఇమ్యూటీ పరవ్ కోసం రకరకాల హెర్బల్ ఔషదాలు ఇచ్చామని సెంట్రల్ జైలు అధికారులు అంటున్నారు.

Recommended Video

COVID Third Wave | Easing COVID 19 Curbs | Oneindia Telugu
కాషాయం దెబ్బకు కరోనా పరుగో పరుగు

కాషాయం దెబ్బకు కరోనా పరుగో పరుగు

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ప్రస్తుతం 4, 643 మంది ఖైదీలు ఉన్నారు. 92 మంది ఖైదీలను పెరోల్ మీద ఇంటికి పంపించామని సెంట్రల్ జైలు అధికారులు అంటున్నారు. వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కేవలం కాషాయం, హెర్బల్ ఔషదాలు, ఇమ్యూనిటిని పెంచే ఆహారం ఇవ్వడం వలనే కరోనా పారిపోయిందని, ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా లేదని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు అంటున్నారు.

English summary
Coronavirus: Bengaluru Parappana Agrahara Central jail has set example for Covid 19 virus treatment with Kashaya Herbal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X