Bengaluru: ఐటీ హబ్ లో ఎంట్రీకి కొత్త రూల్స్, తేడా వస్తే అక్కడికే, అన్ లాక్ దెబ్బతో ఫోలో అంటూ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో ఎంట్రీ ఇవ్వాలనుకునే ప్రజలకు ప్రభుత్వ అధికారులు షాక్ ఇచ్చారు. సుమారు 45 రోజుల తరువాత కర్ణాటక ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ లో భారీగా సడలింపులు ఇచ్చింది. బెంగళూరు నగరంలో అనేక పరిశ్రమల్లో పని చేస్తున్న వాళ్లు కంపెనీ ఉద్యోగులు, డ్రైవర్లు, గార్మెంట్స్ ఉద్యోగులు తదితరులు లాక్ డౌన్ దెబ్బతో ఎవరి ఊళ్లకు వారు వెళ్లిపోయారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సొంతఊర్లకు వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు పోలో అంటూ బెంగళూరులోకి ఎంట్రీ ఇస్తున్నారు. అన్ లాక్ తో కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరులోకి వచ్చే అవకాశం ఉందని అనుమానంతో బెంగళూరు నగరం నలుమూలల సిటీలోకి ఎంట్రీ కాకముందే అందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, తేడా వస్తే వాళ్లను ప్రభుత్వ కరోనా క్వారంటైన్ కేంద్రాలకు పంపించాలని బీబీఎంపీ అధికారులు డిసైడ్ అయ్యారు.

లాక్ డౌన్ దెబ్బతో బెంగళూరు ఖాళీ
కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో తెలుగు రాష్ట్రాల కంటే ముందే కర్ణాటకలో గత నెలలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు నగరంలో అనేక పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు, కంపెనీ ఉద్యోగులు, ట్యాక్సీ డ్రైవర్లు, గార్మెంట్స్ ఉద్యోగులు, వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు తదితర పనులు చేస్తున్న వారు లాక్ డౌన్ దెబ్బతో ఎవరి ఊర్లకు వారు వెళ్లిపోయారు.

ఛలో బెంగళూరు
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సొంతఊర్లకు వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు అన్ లాక్ తో ఫోలో అంటూ బెంగళూరులోకి ఎంట్రీ ఇస్తున్నారు. కర్ణాటకలోని ఇతర జిల్లాల నుంచినే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాల నుంచి వలస కార్మికులు, ఉద్యోగులు కర్ణాటకలోకి, బెంగళూరు నగరంలోకి లక్షల మంది వస్తున్నారు.

కరోనా పాజిటివ్ భయం ?
కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరులోకి వచ్చే అవకాశం ఉందని, అందు వలన కరోనా వైరస్ మళ్లీ వ్యాపించే అవకాశం ఉందని బీబీఎంపీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరం నలుమూలల నుంచి సిటీలోకి ఎంట్రీ కాకముందే అందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని బీబీఎంపీ అధికారులు మొబైల్ టెస్టింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.

బెంగళూరు నలుమూలల సేమ్ సీన్
ఆంధ్రప్రదేశ్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారికి హోసకోటే శివార్లలో, తుమకూరు రోడ్డు, బెంగళూరు-బళ్లారి రోడ్డులో, హోసూరు రోడ్డు, మాగడి రోడ్లలో బెంగళూరు సిటీలోకి వస్తున్న వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు సిటీ నలుమూలల్లో బీబీఎంపీ ఆరోగ్య శాఖకు చెందిన సిబ్బంది ఐటీ హబ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Recommended Video

హోమ్ ఐసోలేషన్ కాదు..... కరోనా క్వారంటైన్
ఎవరికైనా కరోనా పాజిటివ్ అని వెలుగు చూస్తే వాళ్లను హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించడం కంటే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని బీబీఎంపీ అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ దెబ్బతో కరోనా పాజిటివ్ వచ్చినా హోమ్ ఐస్ లేషన్ లో ఉండాలనుకునే వాళ్లకు ఇప్పుడు బీబీఎంపీ అధికారులు ఊహించని షాక్ ఇస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications