కరోనా కేసుల తగ్గుదల: ఎన్నికల ప్రచారాలు, స్టార్ క్యాంపెయినర్లపై విధించిన ఆంక్షల సడలింపు
న్యూఢిల్లీ: కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొంటూ ఎన్నికల ప్రచారంపై విధించిన ఆంక్షలను భారత ఎన్నికల సంఘం ఆదివారం ఆంక్షలను మరింత సడలించింది.
ఒక పార్టీకి ప్రచారం చేయగల స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను పోల్ బాడీ పునరుద్ధరించింది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ/రాష్ట్ర పార్టీలకు 40 మంది, గుర్తింపు పొందిన పార్టీలు కాకుండా ఇతర పార్టీలకు 20 మందికి అనుమతించింది.
రాజకీయ పార్టీలకు రాసిన లేఖలో, ఈసీ ఇలా పేర్కొంది.. "యాక్టివ్, కొత్త COVID-19 కేసుల సంఖ్య తగ్గుతోంది, మహమ్మారి వ్యాప్తిని తనిఖీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు క్రమంగా ఎత్తివేయబడుతున్నాయి. .ఎన్నికల సంఘం తగిన చర్చల తర్వాత స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యపై గరిష్ట పరిమితిని పునరుద్ధరించాలని నిర్ణయించింది' అని తెలిపింది.

రెండు దశల మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల 5, 6, 7 దశలు, మజులి స్థానానికి అస్సాం అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం, పార్టీలు అదనపు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఫిబ్రవరి 23న సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల కమిషన్ లేదా సంబంధిత చీఫ్ ఎలక్టోరల్‌కు సమర్పించవచ్చని పోల్ బాడీ తెలిపింది.
కోవిడ్ -19 మహమ్మారి మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడడంతో జాతీయ, రాష్ట్ర పార్టీలకు స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను 30కి తగ్గించాలని ఈసీ అక్టోబర్ 2020లో నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీల కోసం, స్టార్ క్యాంపెయినర్ల గరిష్ట సంఖ్య 20 నుండి 15కి తగ్గించబడింది.
ఫిబ్రవరి 12న, పరిమిత సంఖ్యలో వ్యక్తులతో పాదయాత్రలను అనుమతించడం అనే చార నిబంధనలను ఈసీ సడలించింది. ప్రచార నిషేధ కాలాన్ని కూడా తగ్గించింది.
ఇంతలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం (ఫిబ్రవరి 20, 2022) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో 19,968 కొత్త కోవిడ్ -19 కేసులు, 673 మరణాలు నమోదైన రోజున ఈసీ సవరించిన నియమాలు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 2,24,187గా ఉన్నాయి.












Click it and Unblock the Notifications