బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus భయం, ఇప్పుడు కర్ణాటకలో ఎల్లోజోన్, హడల్, బెంగళూరు, ఆంధ్రా, తెలంగాణలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) భయం పట్టుకుంది. కరోనా వైరస్ అరికట్టడానికి భారతదేశంలో లాక్ డాన్ అమలులో ఉంది. ఇదే సమయంలో కర్ణాటకలో కరోనా వైరస్ తో పాటు మరో భయం పట్టుకుంది. కర్ణాటకలో ఎల్లో జోన్ ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో ఎండకు అల్లాడుతున్న కర్ణాటక ప్రజలు రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో ఒక పక్క సంతోషం, మరోపక్క ఎక్కడ కరోనా వైరస్ విజృభిస్తుందో అనే భయంతో ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది.

Lockdown: ప్రముఖ హీరోయిన్ కారు ప్రమాదం, జాలీరైడ్, డ్రంక్ అండ్ డ్రైవ్!Lockdown: ప్రముఖ హీరోయిన్ కారు ప్రమాదం, జాలీరైడ్, డ్రంక్ అండ్ డ్రైవ్!

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దులు!

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దులు!

ఏప్రిల్ 7వ తేదీ కర్ణాటక దక్షిణ విభాగంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖా సీనియర్ డైరెక్టర్ (KSNMDC) సీఎస్. పాటిల్ చెప్పారు. అదే విదంగా బెంగళూరు సిటీ, బెంగళూరు గ్రామీణ, కోలారు, రామనగర, చిక్కబళ్ళపురం, చామరాజనగర, మైసూరు, తుమకూరు, చిక్కమగళూరు, కొడగు, దావణగెరె, మండ్య, హాసన్, చిత్రదుర్గ, శివమొగ్గ, బళ్లారి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సీఎస్. పాటిల్ చెప్పారు. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కర్ణాటకలోని కోప్పళ, రాయచూరు. యాదగరిలో సాదారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని సీఎస్. పాటిల్ తెలిపారు.

దక్షిణ కర్ణాటకలో ఎల్లోజోన్ !

దక్షిణ కర్ణాటకలో ఎల్లోజోన్ !

వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం ఎప్రిల్ 5వ తేదీ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు దక్షిణ కర్ణాటకలో మాత్రం ఎల్లోజోన్ ప్రకటించారు. దక్షిణ కర్ణాటకలోని ప్రజలు భారీ వర్షాలు పడితే చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

15 రోజుల్లో ఉష్ణోగ్రత ఎలా ఉందంటే ?

15 రోజుల్లో ఉష్ణోగ్రత ఎలా ఉందంటే ?

గత 15 రోజుల నుంచి కర్ణాటకలోని పలు జిల్లాలో సరాసరి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైయ్యింది. కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో సరాసరి 40. 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైయ్యింది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడితే వాతవరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజులు !

ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజులు !

వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం ఏప్రిల్ 7, 8వ తేదీల్లో రెండు రోజు పాటు దక్షిణ భారతేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలు, తెలంగాణ, తమిళనాడు, కేరళ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 7, 8వ తేదీల్లో చెన్నైలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో కర్ణాటకలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఎల్లోజోన్ ప్రకటించారు. వాతావరణంలో మార్పులు వస్తే కరోనా వైరస్ ఎక్కడ మరింత ఎక్కువగా వ్యాపిస్తుందో ? అనే అనుమానం ప్రజల్లో అప్పుడే మొదలైయ్యింది. అయితే కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది.

English summary
Yellow Zone: Expect rain activities to increase marginally over South interior Karnataka including Bengaluru, around April 7 and 8 reports KSNMDC and skymetweather.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X