బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: మలేషియా నుంచి వచ్చాడు, సెలూన్ లో స్టైల్ గా కటింగ్, కరోనా పాజిటివ్, 15 మంది !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కోలారు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేసినా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సెలూన్ షాపులు తెరుచుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి క్వారంటైన్ లో 14 రోజులు ఉన్నాడు. తరువాత అతని సొంత ప్రాంతానికి వెళ్లి స్థానిక సెలూన్ షాప్ లో స్టైల్ గా హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకున్నాడు. అయితే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెలుగు చూడటం, ఆ వ్యక్తి కటింగ్ చేసుకుని వెళ్లిన తరువాత ఆ షాప్ లోని బార్బర్ మరో 15 మందికి కటింగ్ చెయ్యడంతో అసలు కథ మొదలైయ్యింది. సెలూన్ షాపులో కటింగ్ చేసుకున్న వారు ఇప్పుడు ఆసుపత్రికి క్యూకట్టారు.

Lockdown: వీడి లవ్ స్టోరీ ముందు టైటానిక్ సినిమా వేస్ట్, పెళ్లి కూతురు ఎవరంటే ? రియల్ హీరో !Lockdown: వీడి లవ్ స్టోరీ ముందు టైటానిక్ సినిమా వేస్ట్, పెళ్లి కూతురు ఎవరంటే ? రియల్ హీరో !

 మలేషియా టూ బెంగళూరు

మలేషియా టూ బెంగళూరు

కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లా బంగారుపేటలో 35 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను మలేషియాలో ఉంటున్నాడు. కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్బంగా ఆ వ్యక్తి మలేషియాలోనే ఉండిపోయాడు. వందే భారత్ మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఈ వ్యక్తి మే 22వ తేదీన మలేషియా నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వచ్చాడు.

 బెంగళూరులో ఏం జరిగింది ?

బెంగళూరులో ఏం జరిగింది ?

విదేశాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. బెంగళూరులో అధికారులు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి వెళ్లిన ఆ వ్యక్తి వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. అధికారులు సూచన మేరకు అతను క్వారంటైన్ అవది పూర్తి చేసుకున్న ఆ వ్యక్తికి మే 30వ తేదీ మళ్లీ అధికారులు వైద్యపరీక్షలు చేశారు.

 సెలూన్ షాప్ లో కటింగ్

సెలూన్ షాప్ లో కటింగ్

బెంగళూరులో క్వారంటైన్ లో కాలం గడిపిన వ్యక్తి అధికారులు సూచన మేరకు బయటకు వచ్చాడు. క్వారంటైన్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి కర్ణాటకలోని కోలారు జిల్లా బంగారుపేటలోని వివేకానంద నగర్ లోని సొంత ఇంటికి శనివారం చేరుకున్నాడు. అధికారుల ఆదేశాల మేరకు ఆ వ్యక్తి హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే ఆదివారం ఉదయం వివేకానందనగర్ లోని ఆ వ్యక్తి స్థానిక సెలూన్ షాప్ కు వెళ్లి స్టైల్ గా హెయిర్ కటింగ్, షేవింగ్ చేసుకుని స్మార్ట్ గా రెఢీ అయ్యాడు.

 హడలిపోయిన అధికారులు, స్థానికులు

హడలిపోయిన అధికారులు, స్థానికులు

బంగారుపేటలోని వివేకానందనగర్ లోని వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న అధికారులు బెంగళూరు నుంచి బంగారుపేటకు వెళ్లారు. వివేకానందనగరలో నివాసం ఉంటూ కరోనా పాజిటివ్ వచ్చిన 35 ఏళ్ల వ్యక్తిని ప్రత్యేక వాహనంలో బెంగళూరులోని కోవిడ్ 19 ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంగారుపేట పురసభ అధికారులు వివేకానందనగర్ ను రోడ్ జోన్ గా ప్రకటించారు. బంగారుపేటలోని వివేకానందనగర్ లో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు.

 సెలూన్ షాప్ లో ఏం జరిగిందంటే ?

సెలూన్ షాప్ లో ఏం జరిగిందంటే ?

వివేకానంద నగర్ లో నివాసం ఉంటున్న వ్యక్తి స్థానిక సెలూన్ షాప్ లో హెయిర్ కటింగ్, షేవింగ్ చేసుకుని బయటకు వచ్చిన తరువాత ఆదే షాపులో అతనికి కటింగ్ చేసిన వ్యక్తి దగ్గర మరో 15 మందికిపైగా కటింగ్ చేసుకున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కటింగ్ చేసిన బార్బర్ మరో 15 మందికి కటింగ్, షేవింగ్ చెయ్యడంతో ఆ సెలూన్ షాపుకు వెళ్లి వచ్చిన వారు హడలిపోతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కటింగ్ చేసిన బార్బర్ ను, అతని దగ్గర కటింగ్, షేవింగ్ చేసుకున్న మరో 15 మందిని ఇప్పుడు క్వారంటైన్ కు తరలించారు. మొత్తం మీద బంగారుపేటలో సెలూన్ షాప్ లో ఇంత కథ జరిగిందని తెలుసుకున్న స్థానిక ప్రజలు ఇప్పుడు కరోనా వైరస్ భయంతో హడలిపోతున్నారు.

English summary
Coronavirus: The fear begun among people who visited a salon shop in Bangarapet, Kolar. A reason for this is, a man who came to the salon yesterday confirmed Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X