Coronavirus India: 5నెలల తర్వాత 2వేలు దాటి భారీగా కరోనా కేసులు; ఏడు మరణాలు!!

భారతదేశంలో కరోనా మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి దేశానికి ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో భారత దేశంలో కరోనా కేసులను చూసినట్లయితే 2,151 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు క్రమంగా భారీగా పెరుగుతుండటం ఆందోళనగ్గా మారింది. గత ఐదు నెలలుగా దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం ఇదే మళ్లీ తొలిసారి అని కేంద్రం పేర్కొంది. గత అక్టోబర్ నుండి ఇంత భారీగా కేసులు నమోదైన దాఖలాలు లేవు.

బుధవారం ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన డేటా ప్రకారం గత 24 గంటల్లో 2,151 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 11,903 క్రియాశీలక కరోనా కేసులు ఉన్నట్టు సమాచారం. కాగా కరోనా మహమ్మారి కారణంగా కర్ణాటకలో ఒకరు, మహారాష్ట్ర ,కేరళలో ముగ్గురు చొప్పున మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు అధికారిక డేటా వెల్లడిస్తుంది. ప్రస్తుతం నమోదైన కేసులను బట్టి ప్రస్తుతం కరోనా రోజువారి సానుకూలత రేటు 1.51 శాతంగా ఉన్నట్టు సమాచారం. వారం సానుకూలత రేటు 1. 53% గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కేసుల మరణాల రేటు 1.19 శాతంగా నమోదవుతుంది.

Coronavirus India: After 5 months, Corona cases have crossed 2 thousand; Seven deaths in last 24 hrs

ఇప్పటివరకు కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుండి నమోదైన మొత్తం కేసులను చూస్తే 4. 47 కోట్ల కరోనా కేసులు నమోదు అయినట్లు సమాచారం. కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,66,925 కు పెరిగింది. దీంతో జాతీయ కోవిడ్ 19 రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03% గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220. 65 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగల సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+