coronavirus: కనిక కపూర్ మీరు వైరస్ సోకిన రోగి.. స్టార్‌లా ప్రవర్తన సరికాదు, ఆస్పత్రి యాజమాన్యం
కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గాయనీ కనిక కపూర్ తీరు మారలేదు. ఇటీవల లండన్ వెళ్లి కరోనా రక్కిసి అంటించుకొని ఇండియా వచ్చిన కనిక.. హాస్పిటల్‌లో తానో స్టార్ మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. వైరస్ సోకిన రోగిలా ఉండక.. తాను స్టార్‌ని అని బిల్డప్ ఇస్తున్నారు. ఆమె తీరుపై ఆస్పత్రి యాజమాన్యం మండిపడింది. ఇది సరికాదని, వ్యవహారశైలి మార్చుకోవాలని స్పష్టంచేసింది.

సదుపాయాలు కల్పిస్తోన్నా..
వైరస్ సోకి తమ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న కనిక కపూర్‌కు మంచి సదుపాయాలు అందజేస్తున్నామని లక్నో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఆమె మాత్రం ఓ రోగి మాదిరిగా కాకుండా.. తనో స్టార్ అని బిహేవ్ చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్పత్రిలో మంచి సదుపాయాలు అందజేస్తోన్న సిబ్బందికి సహకరించాల్సింది పోయి.. తానో స్టార్ అని కొండెక్కి కూర్చొన్నారని ధ్వజమెత్తింది. సిబ్బందికి సహకరిస్తే ఆమెకు మంచిదని ఆస్పత్రి డైరెక్టర్ ఆర్కే ధిమాన్ సూచించారు.

స్పెషల్ రూమ్..
వైరస్‌కు చికిత్స తీసుకుంటున్న కనికకు ఆస్పత్రి కిచెన్ నుంచి గుల్టెన్ ఫ్రీ డైట్ అందజేస్తున్నామని ఆయన వివరించారు. ఐసోలేషన్ గదిలోనే టాయ్‌లెట్ ఉందని పేర్కొన్నారు. రోగికి సంబంధించి బెడ్, టీబీ, ఏసీతోపాటు వైరస్‌కి సంబంధించి ఎయిర్ హ్యాడ్లింగ్ యూనిట్ కూడా సమకూర్చామని పేర్కొన్నారు. రోగికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని.. కానీ కనిక కపూర్ మాత్రం తాను రోగిలా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు.

దుష్యంత్.. సెల్ఫ్ క్వారంటైన్
ఇటీవల లండన్ వెళ్లొచ్చిన కనిక కపూర్ స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యారు. ఆ పార్టీకి బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ సహా పలువురు హాజరయ్యారు. తర్వాత కనిక కపూర్ కరోనా పాజిటివ్ వచ్చిందని తేలడంతో.. దుష్యంత్ సింగ్ సహా అతని త్లి రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. వీరితోపాటు ఆ పార్టీకి హాజరైన ప్రముఖులు కూడా బయటకి రావడం లేదు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, అనుప్రియ పటేల్ కూడా కనిక కపూర్‌తో చనువుగా ఉన్నారు. దీంతో వారు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications