బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా ఫ్రీ పబ్లిసిటి కోసం ప్రయత్నాలు, ఎమ్మెల్యేకి బెండ్ తీసిన సీఎం, తిక్క చేష్టలు?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసిందని, కరోనా మహమ్మారిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నానా తిప్పలు పడుతోందని, ఒక భాద్యతకలిగిన పదవిలో ఉంటూ సమదూరం పాటించకుండా ఇఫ్టం వచ్చినట్లు ప్రవర్థిస్తావా ? నువ్వు ఏమనుకుంటున్నావ్ ? ఇంకోసారి ఇలా తిక్కచేష్టలు చేసినట్లు తెలిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంపీ.

రేణుకాచార్య మీద మండిపడ్డారు. అధికారంలో ఉన్నాం కాదా ? అంటూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనని సీఎం యడియూరప్ప బీజేపీ ఎమ్మెల్యేకి చివాట్లు పెట్టారు. సీఎం యడియూరప్ప ఎందుకు బీజేపీ ఎమ్మెల్యే మీద అసహనం వ్యక్తం చేశారు అని అసలు విషయం తెలుసుకున్న ప్రజలు సైతం ఆ ప్రజాప్రతినిధి మీద మండిపడుతున్నారు. పబ్లిసిటి కోసం ప్రయత్నించిన ఎమ్మెల్యేపై సీఎం మండిపడటంతో మనం జాగ్రత్తగా ఉండాలని కొందరు బీజేపీ నాయకులు అలర్ట్ అయ్యారని తెలిసింది.

Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !

వీడియో అప్ లోడ్ చేసిన ఎమ్మెల్యే

వీడియో అప్ లోడ్ చేసిన ఎమ్మెల్యే

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే, ఎప్పుడు పడితే అప్పుడు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ఎంపీ. రేణుకాచార్య కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని పదేపదే చెబుతున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ కట్టడి కోసం శ్రమిస్తున్న ఆశా వర్కర్లతో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఓ సమావేశం నిర్వహించారు. ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించిన సమయంలో తీసిన వీడియోను బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

పబ్లిసిటి కోసం ప్రయత్నాలు ?

పబ్లిసిటి కోసం ప్రయత్నాలు ?

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండుసార్లు మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు చిక్కుతుందని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య భావించారు. సీఎం బీఎస్. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా ముద్రవేసుకున్న రేణుకాచార్యకు మంత్రి పదవి రాకపోవడంతో చాలా నిరాశ చెందారు. మంత్రి పదవి లేకపోయినా ఏదో ఒక విధంగా పబ్లిసిటి సంపాధించుకోవాలని రేణుకాచార్య అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

 సీఎం మెచ్చుకుంటారనుకుంటే బెండ్ తీశారు

సీఎం మెచ్చుకుంటారనుకుంటే బెండ్ తీశారు

కరోనా కట్టడికి తాను శక్తి వంచనలేకుండా పని చేస్తున్నానని సీఎం యడియూరప్ప దగ్గర మంచి మార్కులు సంపాధించుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఆశా వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అనేక ఉచిత సలహాలు ఇచ్చారు. ఆశా వర్కర్లతో నిర్వహించిన సమావేశం వివరాలను వీడియో తీసి సీఎం యడియూరప్ప తనను మెచ్చుకుంటారని సోషల్ మీడియాలో పెట్టారు. అయితే సీఎం యడియూరప్ప బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్యకు బెండ్ తీశారు.

ప్రధాని మీకు ప్రత్యేకంగా చెప్పాలా?

ప్రధాని మీకు ప్రత్యేకంగా చెప్పాలా?

కరోనా వైరస్ కట్టడి చెయ్యాలంటే మన దగ్గర ఉన్న ఒకేఒక ఆయుధం సమదూరం పాటించడం, అందుకే లాక్ డౌన్ అమలు చేశాం, ఎవ్వరూ ఈ నియమాలను ఉల్లంఘించకూడదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య ఆశా వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో సమదూరం పాటించకుండా గుంపులు గుంపులుగా సమావేశం ఏర్పాటు చేశారని తెలుసుకున్న సీఎం యడియూరప్ప మండిపడుతున్నారు. ఏం మీకు ప్రభుత్వాలు చెప్పే నియమాలు, నిబంధనలు వర్తించవా ?, ప్రధాని నరేంద్ర మోదీ మీకు ప్రత్యేకంగా చెప్పాలా ? అంటూ బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్యకు క్లాస్ పీకారని తెలిసింది.

Recommended Video

Lockdown : PM Modi Video Conference With CMs On COVID-19 & Lockdown
 దేశానికి ఒక మాట, మీకు ఒక మాటా ?

దేశానికి ఒక మాట, మీకు ఒక మాటా ?

ప్రతి ఒక్కరూ సమదూరం పాటించాలని దేశం మొత్తం చెబుతుంటే అవేవి పట్టనట్లు మీరు గుంపులు గుంపులుగా సమావేశాలు నిర్వహిస్తారా ? ఎమ్మెల్యే పదవిలో ఉంటూ మీరు చేసే పనులు ఇవేనా ? అంటూ సీఎం యడియూరప్ప బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్యకు క్లాస్ పీకారని వెలుగు చూసింది. ఇంకోసారి ఇలా జరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయని, మీ వలన మేము (బీజేపీ ప్రభుత్వం) చెడ్డపేరు తెచ్చుకోవడానికి సిద్దంగా లేమని సీఎం యడియూరప్ప బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్యను గట్టిగానే మందలించారని ఆ పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.

English summary
Coronavirus: Karnataka Chief Minister BS Yediyurappa has Warned to MLA MP Renukacharya For Not Following social distance in Programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X