Coronavirus: సిలికాన్ సిటీలో ఈ ప్రాంతాలు సీల్ డౌన్, చిల్లర గేమ్స్ ఆడితే ఎఫ్ఐఆర్, మొబైల్ ప్లాన్ !
బెంగళూరు: దేశ ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీ కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు హడలిపోయింది. 24 గంటల్లో సిలికాన్ సిటీ బెంగళూరులో ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరులోని పలు ప్రాంతాలు పూర్తిగా సీల్ డౌన్ చేసి లాక్ డౌన్ అమలు చెయ్యాలని, ఎవరైనా తిక్కచేష్టలు చేసి లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సంబంధిత అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు నగరంలో ఒక్కసారిగా వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు ఆందోళకు గురౌతున్నారు.

బెంగళూరులో కరోనా దెబ్బ
ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీలో గత 24 గంటల్లో ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఈ దెబ్బతో బెంగళూరు విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులు, వైద్య శాఖ అధికారులతో సీఎం బీఎస్. యడియూరప్ప సమావేశమై కరోనా కట్టడి కోసం తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు.

సిలికాన్ సిటీలో ఈ ప్రాంతాలు సీల్ డౌన్
సిలికాన్ సిటీ బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే కేఆర్ మార్కెట్ (సిటీ మార్కెట్) తో పాటు పరిసర ప్రాంతాలైన చిక్కపేట్, చామరాజపేట్, కలాసిపాళ్య, సిద్దాపుర, వీవీపురం ప్రాంతాలు పూర్తిగా సీల్ డౌన్ చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజల మీద గట్టి నిఘా వెయ్యాలని సీఎం బీఎస్. యడియూరప్ప బీబీఎంపీ అధికారులకు సూచించారు.

ఐదు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు
బెంగళూరు సిటీలోని ఐదు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు వందకు పైగా పెరిగిపోవడంతో సీఎం యడియూరప్ప ఆ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. బెంగళూరు సిటీలో రెండు రోజుల్లో ఎక్కువ కేసులు నమోదైన కేఆర్ మార్కెట్, వీవీ పురం, కలాసిపాళ్య, చిక్కపేట్, విద్యారణ్యపుర, వీవీపురం, సిద్దాపుర, ధర్మరాయ దేవస్థానం వార్డులు పూర్తిగా సీల్ డౌన్ చెయ్యాలని, లాక్ డౌన్ సడలింపులు ఈ ప్రాంతాలకు వర్తించకుండా చూడాలని సీఎం బీఎస్. యడియూరప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మొబైల్ తో మాస్టర్ ప్లాన్
కరోనా వైరస్ సోకిన వారు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచిస్తే కొందరు వారి ఇళ్లలో మొబైల్స్ పెట్టి రోడ్ల మీద విచ్చలవిడిగా సంచరిస్తున్నారని వెలుగు చూసింది. ఇలా ఎవరైనా చేస్తున్నారని మీకు తెలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని వారి మీద కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చెయ్యాలని సీఎం బీఎస్. యడియూరప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారని కర్ణాటక రెవన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ మీడియాకు చెప్పారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ధరలు ఫిక్స్
బెంగళూరు సిటీలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ వ్యాధి అనుమానితులకు చికిత్స చేసే ముసుగులో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని మాకు తెలిసిందని, అలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం బీఎస్. యడియూరప్ప హెచ్చరించారు. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ అనుమానితులకు చికిత్స చెయ్యడానికి అధికారులు ఓ ధర ఫిక్స్ చేశారని, అంతకు మించి ఫీజులు వసూలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల ప్రజలు కర్ణాటకలోకి రావడం వలనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications