వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణ సహా: ఒక్క క్లిక్‌తో ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ స్టాక్ ఇలా తెలుసుకోవచ్చు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా నమోదవుతున్నాయి. జనంపై పంజా విసురుతున్నాయి. ఏ ఒక్క రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా..అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను చూస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. వరుసగా రెండున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 2,73,810 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఢిల్లీ లాక్‌డౌన్: ఇ-పాస్ అవసరమా?: మినహాయింపులు ఎవరికి: లిక్కర్ షాపులు ఫుల్ఢిల్లీ లాక్‌డౌన్: ఇ-పాస్ అవసరమా?: మినహాయింపులు ఎవరికి: లిక్కర్ షాపులు ఫుల్

మూడు లక్షల మార్క్‌ను దాటడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రులు చాలట్లేదు. ఆసుపత్రుల ఆవరణలో కరోనా రోగులకు వైద్య సేవలను అందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు.. ఇలా అనేక రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.

Coronavirus: Know where you can find Remdesivir,Oxygen and plasma available in hospitals

ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, ప్లాస్మా ఇప్పుడు ప్రజలకు అత్యవసరంగా మారింది. వాటి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. ఒక్క క్లిక్‌తో వాటన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రెమ్‌డెసివిర్ వంటి ప్రాణాధార ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్లాస్మా డోనర్లను గుర్తించడం, ఏఏ ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలుసుకోవడం కష్టసాధ్యమౌతోంది. ఇదే అతిపెద్ద సవాల్‌గా మారింది. ఈ లోటును అధిగమించేలా సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. వాటితో పాటు అంబులెన్సులు, హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఆర్టీ-పీసీఆర్ టెస్టులు, హెల్ప్‌లైన్ నంబర్లు, ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా, వెబ్‌సైట్ లింకులు, కస్టమర్ కేర్ నంబర్లు.. వాటన్నింటిని ఒకే చోటకు తీసుకొచ్చి.. ఒక్క క్లిక్‌తో సమగ్ర వివరాలను తెలుసుకోవడానికి ఉద్దేశించిన సమాచారం ఇది.

క్లిక్ చేయాల్సిన లింక్ ఇదే. ఇందులో ఏపీ, తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులు, అందులో ఉండే పడకల ఖాళీల వివరాలు, ఆక్సిజన్ నిల్వలు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, ప్లాస్మా డోనర్లు, అంబులెన్సులు, కాల్ సెంటర్లు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వశాఖల వెబ్‌సైట్ లింకులు.. ఇవన్నీ పొందుపరిచి ఉన్నాయి. తమకు అవసరమైన సౌకర్యానికి సంబంధించిన పదాన్ని సెర్చ్ కీగా వినియోగించడం ద్వారా వాటి వివరాలను తెలుసుకోవచ్చు.

English summary
Coronavirus: Know where you can find Remdesivir,Oxygen and plasma available in hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X