lockdown:ఎమ్మెల్యేకు వర్తించని నిబంధన,పిల్లలు,పెద్దలతో కలిసి బర్త్ డే వేడుక, కేక్ కట్ చేసి,బిర్యానీ
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంటే..బాధ్యత కలిగిన నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొన్న మహారాష్ట్రలో దాదారావు కెచే అనే బీజేపీ ఎమ్మెల్యే సరుకులు పంపిణీ చేయడంలో సామాజిక దూరం పాటించలేదు. నిన్న జార్ఖండ్‌లో మరో బీజేపీ ఎమ్మెల్యే జార్ఖండ్ మైదానంలో ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కానీ ఇక్కడ కూడా సేమ్ సిచుయేషన్.. వీరిద్దరి వ్యవహారశైలితో తలపట్టుకుంటోన్న బీజేపీకి.. మరో ఎమ్మెల్యే తోడయ్యాడు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డేను అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. అతని జన్మదిన వేడుకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లలు కూడా
తుముకూరు జిల్లా తురువెకరె నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే జయరాం జన్మదినం శుక్రవారం. ప్రతీ ఏడాది హంగు ఆర్భాటంతో చేసుకునేవారు. కానీ ఈ సారి సామాజిక దూరం పాటిస్తే సరిపోయేది. లేదంటే దూరంగా ఉన్న ఓకే.. కానీ ఎమ్మెల్యే కదా.. బర్త్ డే చేసుకోకుంటే కొంపలు మునుగుతాయని అనుకున్నాడో ఏమో.. శుక్రవారం ఎప్పటిలాగానే బర్త్ డే జరుపుకున్నారు.

గ్లౌజ్ వేసుకొని మరీ..
తుముకూరులో గుబ్బిలో హితులు, సన్నిహితుల సమక్షంలో బర్త్ డే జరుపుకున్నారు. తన చుట్టు పిల్లలు, సన్నిహితులు ఉండగా.. చేతికి గ్లౌజ్ వేసుకొని మరీ.. చాక్ లొట్ కేక్ కత్తిరించారు. తర్వాత చిన్నారుల సహా పెద్దలందరికీ బర్త్ డే కేకు పంచిపెట్టారు. తర్వాత అందరికీ బిర్యానీ పెట్టాడు. వందలాది మంది గుమికూడటంతో.. వైరస్ ఎక్కడ ప్రబలుతుందోననే టెన్షన్ నెలకొంది. కానీ ఎమ్మెల్యే మాత్రం తనకేమి పట్టనట్టు వ్యవహరించారు.

యడియూరప్ప, శివకుమార్
బీజేపీ ఎమ్మెల్యే జయరాం తీరుపు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదివరకు కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా నిబంధనలను ఉల్లంఘించారు. మార్చి 15వ తేదీన బెలగవికి చెందిన బీజేపీ నేత కూతురి పెళ్లికి హాజరయ్యారు. వివాహానికి వెయ్యి మందికి పైగా హాజరవడం విశేషం. ఆ తర్వాత కర్ణాటక పీసీసీ చీఫ్‌గా పదవీ చేపట్టే సమయంలో డీకే శివకుమార్ కూడా సోషల్ డిస్టన్స్ మరచిపోయారు. కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయం వద్ద పదుల సంఖ్యలో జనం గుమిగూడటం ఆందోళన నెలకొంది.

కరోనా కలవరం..
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 6761కి చేరుకున్నది. ఇందులో 6039 మంది చికిత్స తీసుకుంటుండగా.. 516 మంది డిశ్చార్జ్ అయ్యారు. చనిపోయిన వారి సంఖ్య 206కి చేరుకున్నది. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 200కు చేరుకున్నది. శుక్రవారం ఒక్కరోజు 10 కేసులు బయటపడ్డాయి. ఇందులో మైసూరుకు చెందిన 8 ఏళ్ల బాలుడు, బెంగళూరు రూరల్‌కి చెందిన 11 ఏళ్ల బాలిక ఉన్నారు. వైరస్ తగ్గడంతో 34 మందిని డిశ్చార్జ్ చేశామని.. ఆరుగురు చనిపోయారని కర్ణాటక వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరోవైపు లాక్‌డౌన్ పొడిగింపు ప్రధాని మోడీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని సీఎం యడియూరప్ప స్పష్టంచేశారు. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 4500 మందిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Recommended Video
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications