చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: దేశాన్ని ముంచేస్తున్న మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కరోజులో, కేసీఆర్, జగన్ అలర్ట్ !

|
Google Oneindia TeluguNews

ముంబై/ చెన్నై: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) హాట్ స్పాట్ కేంద్రాలుగా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచే పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ఒక్కరోజులో మహారాష్ట్రలో 3, 752, తమిళనాడులో 2, 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ప్రాణ భయంతో హడలిపోతున్నారు. ఇక తెలుగు ప్రజలు ఎవ్వరూ మహారాష్ట్ర, తమిళనాడు వైపు వెళ్లకూడదని తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్, జగన్ తెలుగు ప్రజలకు మనవి చేస్తున్నారు. మహారాష్ట్రలో నేటి వరకు 1, 20, 504 కేసులు నమోదు అయ్యాయి. ఇక తమిళనాడులో ఏకంగా 52, 334 కరోనా పాజిటివ్ కేసులు కావడంతో కేంద్ర ప్రభుత్వంతో సహ ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు షాక్ కు గురైనాయి.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

 లాక్ డౌన్ తరువాత ?

లాక్ డౌన్ తరువాత ?

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 25వ తేదీ నుంచి భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ 5.0 అమలులో ఉంది. అయినా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల తరువాత కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయని అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే బహిరంగంగా చెప్పాయి.

మహారాష్ట్ర పేరు చెబితే !

మహారాష్ట్ర పేరు చెబితే !

దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ కేంద్రాల్లో మహారాష్ట్ర నెంబర్ వన్ గా నిలిచింది. మహారాష్ట్రలో 1, 20, 504 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ చికిత్స విఫలమై ఇంత వరకు మహారాష్ట్రలో చనిపోయిన వారి సంఖ్య 5, 751కు చేరింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కరోనా వైరస్ చికిత్స విఫలమై 100 మందికి పైగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 తమిళనాడు ఏం తక్కువ కాదు !

తమిళనాడు ఏం తక్కువ కాదు !

తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏం అంత తక్కువగా లేదు. దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ గా తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52, 334కు చేరింది. గురువారం ఒక్కరోజు తమిళనాడులో 2, 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో గురువారం ఒక్కరోజు కరోనా వైరస్ చికిత్స విఫలమై 49 మంది మరణించారు.

చెన్నై సిటీ కరోనా హాట్ స్పాట్

చెన్నై సిటీ కరోనా హాట్ స్పాట్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 37, 070 నమోదైయ్యింది. గురువారం ఒక్కరోజు చెన్నై సిటీలో 1, 373 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో కరోనా వైరస్ వ్యాధితో పోరాటం చేసిన 28, 641 మంది ప్రాణాలతో బయటపడ్డారు. తమిళనాడులో ఇప్పటి వరకు కరోనా వైరస్ చికిత్స విఫలమై 625 మంది మరణించారు.

 సీఎంలు కేసీఆర్, జగన్ మనవి

సీఎంలు కేసీఆర్, జగన్ మనవి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (తెలుగు రాష్ట్రాలు)తో పాటు అనేక రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, తమిళనాడుకు ఎవ్వరూ వెళ్లకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే మనవి చేస్తున్నాయి. కరోనా వైరస్ కేసులు చాపకింద నీరులో వ్యాపిస్తున్న సమయంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లడం అంత మంచిది కాదని, అది మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్. జగన్ తెలుగు ప్రజలకు మనవి చేశారు. మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్, వైఎస్. జగన్ తెలుగు ప్రజలకు మనవి చేశారు.

Recommended Video

CM KCR Holds మీటింగ్ With కలెక్టర్స్ Over COVID-19 & Other Issues
 సరిహద్దులు బంద్

సరిహద్దులు బంద్

అనవసరంగా ఆ రెండు రాష్ట్రాల్లో ఎందుకు సంచరించాలని అని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద కరోనా హాట్ స్పాట్ రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లకుండా ఉండటమే మంచిదని తెలుగు రాష్ట్రాల ప్రజలు నిర్ణయించారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్ర సరిహద్దులను ఇప్పటికే పొరుగు రాష్ట్రాల చెక్ పోస్టుల దగ్గర దాదాపు పూర్తిగా బంద్ చేశారు.

English summary
భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) హాట్ స్పాట్ కేంద్రాలుగా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచే పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ఒక్కరోజులో మహారాష్ట్రలో 3, 752, తమిళనాడులో 2, 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ప్రాణ భయంతో హడలిపోతున్నారు. ఇక తెలుగు ప్రజలు ఎవ్వరూ మహారాష్ట్ర, తమిళనాడు వైపు వెళ్లకూడదని తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్, జగన్ తెలుగు ప్రజలకు మనవి చేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X