• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యాక్సిన్ సామర్థ్యంపై కరోనా ఉత్పరివర్తనాలు ప్రభావం చూపుతాయా..?

|

ఆగష్టు నెలలో నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినామిక్స్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఓ SARS- COV-2కు సంబంధించిన జన్యు క్రమంపై ఒక పేపర్ పబ్లిష్ చేసింది. దీని ప్రకారం ఈ బృందం దేశవ్యాప్తంగా నోటి నుంచి నాసికం నుంచి శాంపిల్స్ సేకరించింది. దాదాపు 1000 వైరల్ జన్యువులను క్రమం చేసి పరిశీలించింది. అయితే ఐరోపా దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఓ ప్రత్యేకమైన జన్యువు విడుదలైందని అదే వైరస్‌గా వ్యాప్తి చెందిందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. A2a హాప్లోటైప్ D614G అనే జన్యు పరివర్తన అత్యంత విస్తృతంగా దేశంలో వ్యాప్తి చెందిందని చెప్పారు.

ఒకప్పుడు హార్స్ ఫార్మ్ నేడు కరోనావైరస్ వ్యాక్సిన్‌కు ఆలయం..ప్రపంచం దృష్టి ఈ భారత సంస్థ వైపే..!

 జన్యు క్రమంపై జరుగుతున్న అధ్యయనాలు

జన్యు క్రమంపై జరుగుతున్న అధ్యయనాలు

ఇక జన్యుక్రమం ద్వారా వ్యాధి వ్యాపిస్తుందా , మరణాలపై కూడా దీని ప్రభావం ఉందా అనేదానిపై ఇటు భారత్‌లో అటు ప్రపంచవ్యాప్తంగా కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి. D614G అనే జన్యువుపై ఎక్కువగా దృష్టి సారించడం జరిగింది. వైరస్‌లోని ప్రొటీన్స్‌లో ఇది అధిక స్థాయిలో ఉన్నట్లు గమనించారు. మానవ కణాలను బంధించడంలో D614G జన్యువు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రొటీన్ పరివర్తన జరిగే సమయంలో వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొంది వైరస్‌ను ప్రతిఘటించడం జరుగుతుంది. అయితే భారత శాస్త్రవేత్తలకు గానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు గానీ ఇది పెద్ద విషయం కాదు కానీ ఈ జన్యుక్రమంపై దృష్టి సారించి ఈ వైరస్ పెరగకుండా అంతం చేయడం ఎలా అనేదే ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది.

శాస్త్రవేత్తల అనుమానం ఏంటి..?

శాస్త్రవేత్తల అనుమానం ఏంటి..?

పరివర్తన చెందుతున్న సమయంలో ప్రొటీన్‌లో మార్పులు వస్తే వ్యాక్సిన్ పనిచేయకపోయే అవకాశాలున్నాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే వచ్చే వ్యాక్సిన్‌లన్నీ రోగనిరోధక శక్తిని పెంచేలానే రూపొందుతున్నాయి. అందుకే దీనిపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుందని ఆమేరకు వైరస్‌ను ట్రాక్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గగన్ దీప్ కంగ్ .వైరస్ పనిచేయాలంటే ప్రొటీన్ చాలా అవసరమైనందున దీనిపై దృష్టి సారించాలని ప్రొటీన్‌లో మార్పులు జరిగినప్పటికీ కూడా వైరస్ దీన్ని తట్టుకోగలదు కాబట్టి ప్రజలకు సోకే అవకాశాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

  Russia's Covid-19 Vaccine : How Can We Trust సైడ్ ఎఫెక్ట్స్ చూడకుండా ప్రజలపై ప్రయోగాలా ? Scientists
   వ్యాక్సిన్ సామర్థ్యంను ప్రభావితం చేస్తుందా..?

  వ్యాక్సిన్ సామర్థ్యంను ప్రభావితం చేస్తుందా..?

  "వైరస్ ఎక్కువగా వృద్ధి చెందేందుకే ప్రయత్నిస్తుంది.అయితే వైరస్ బతకాలంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూనే ఉండాలి. ఇందుకోసం ఒక ప్రెజర్‌ను ముందుగానే సృష్టించి వైరస్‌ను ఈ ప్రెజర్‌పైకి వదులుతాం. ప్రెజర్ అంటే మన రోగనిరోధక శక్తి అని భావించాల్సి ఉంటుంది. ఇక రోగనిరోధక శక్తి ఎక్కువగా వైరస్‌ను ప్రతిఘటిస్తే అది పరివర్తన చెందుతుంది. అదే సమయంలో హాని చేకూరుస్తుంది" అని చెప్పారు నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనామిక్స్ డైరెక్టర్ డాక్టర్ సౌమిత్రి దాస్. అంతేకాదు D614G అనే ఈ ప్రొటీన్ ఇప్పుడు తయారవుతున్న వ్యాక్సిన్‌లపై ప్రభావం చూపుతుందని తద్వారా వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ వైరస్ నుంచి బయటపడకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్‌ తయారు చేసే సమయంలో D614G ద్వారా చెందే పరివర్తనాన్ని దృష్టిలో ఉంచుకుని చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

  English summary
  Scientists say that while D614G gene mutation is not a major concern, it is essential for the scientific community and governments to continuously track and sequence genomes to monitor the evolution of the coronavirus.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X