ఒమిక్రాన్ టెన్షన్ - 3 రోజుల్లో కేసులు రెట్టింపు : అప్రమత్తంగా ఉండాల్సిందే - డబ్ల్యూహెచ్‌వో..!!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు పలు యూరప్ దేశాల్లో మరలా లాక్ డౌన్ వైపు తీసుకెళ్తోంది. డెల్టా కంటే వేగంగా వైరస్ విస్తరిస్తున్న అంశం పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒమిక్రాన్ వైరస్ 'స్థానిక వ్యాప్తి' ఉన్నచోట ఒకటిన్నర రోజు నుంచి మూడు రోజుల వ్యవధిలో కేసులు రెట్టింపు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. హెర్డ్‌ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొంది.

వేరియంట్‌ అధిక వ్యాప్తి

వేరియంట్‌ అధిక వ్యాప్తి

దీనికి.. రోగ నిరోధకతను తప్పించుకునే సామర్థ్యమా లేక వేరియంట్‌ అధిక వ్యాప్తి రేటు కారణమా అనే విషయంపై స్పష్టత లేదని వివరించింది. 89 దేశాలకు ఒమైక్రాన్‌ వ్యాపించిందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో ఒమైక్రాన్‌ కేసులు నమోదవడం పట్ల డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. మరింత వ్యాప్తి చెందకుండా ప్రజారోగ్య, కట్టడి చర్యలను పటిష్ఠం చేయాలని ఆగ్నేయాసియా డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సూచించారు. ఇక, భారత్ లోనూ ఒమైక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 4 రాష్ట్రాల్లో 30 కేసులు వచ్చాయి. కర్ణాటకలో 6, కేరళలో 4, మహారాష్ట్రలో 3 నమోదయ్యాయి.

దేశంలోనూ విస్తరిస్తున్న కేసులు

దేశంలోనూ విస్తరిస్తున్న కేసులు

కర్ణాటక పాజిటివ్‌లలో ఐదుగురు దక్షిణ కన్నడ జిల్లాల్లోని రెండు విద్యాసంస్థలకు చెందినవారు. వీరి ప్రయాణ చరిత్ర, అంతర్జాతీయ ప్రయాణికులతో ఏమైనా కాంటాక్టు అయ్యారా? అనేది తెలియాల్సి ఉంది. కేరళలో ట్యునీషియా నుంచి ప్రైవేటు విమానంలో వచ్చిన వ్యక్తికి కొత్త వేరియంట్‌ సోకింది. అమెరికాలోని న్యూయార్క్‌ నుంచి మహారాష్ట్ర చేరిన యువకుడి (29)కి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. టీకా తీసుకున్నా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ఢిల్లీలోని 3 ప్రయివేటు ఆస్పత్రుల్లో ఐసొలేషన్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. యూకేలో ఒక్క రోజులోనే 10 వేల ఒమైక్రాన్‌ కేసులు గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం


కొత్త వేరియంట్ ఆందోళన పెంచుతున్న సమయంలో 'కొవిషీల్డ్‌' కంటే ప్రభావవంతమైన బూస్టర్‌ డోసుగా కోవోవ్యాక్స్‌ పనికొస్తుందని భారత ప్రభుత్వ జన్యుక్రమ విశ్లేషణ (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) సంస్థ 'ఇన్సాకాగ్‌' డైరెక్టర్‌ అనురాగ్‌ అగ్రవాల్‌ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం త్వరపడటం మంచిదని సూచించారు. దీన్ని తీసుకున్న వారికి ఆరోగ్య భద్రత చేకూరడంతో పాటు బలమైన రోగ నిరోధక స్పందన కలిగినట్లు అధ్యయనంలో తేలిందని చెప్పుకొచ్చారు.

2024 వరకు కొనసాగే అవకాశం

2024 వరకు కొనసాగే అవకాశం

ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్ పైన ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందనే దాని పైన మరింతగా అధ్యయనం చేయాల్సి ఉంది. అమెరికా ఫార్మా కంపెనీ 'ఫైజర్‌' చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ మైఖేల్‌ డోల్‌స్టెన్‌ ఈ వైరస్ 2024 వరకు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రయోగ పరీక్షల్లో భాగంగా 2 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు తమ టీకా రెండు డోసులను (ఒక్కో డోసు 3 మైక్రోగ్రామ్‌లు) అందించినా ఆశాజనక స్థాయిలో రోగ నిరోధక స్పందన రాలేదన్నారు. 2 నెలల విరామం తర్వాత మూడో డోసును కూడా పరీక్షించనున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+