బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ సహా ఆ నగరాల్లో ఆందోళనకర పరిస్థితి: కోలుకుంటున్నామంటూ కేంద్రమంత్రి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పలువురు మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసుల్లో 0.28శాతం మంది మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారని తెలిపారు.

ఢిల్లీని దాటేసిన ఏపీ: మూడోరోజూ 10వేలు దాటిన కరోనా కేసులు, 68 మరణాలు, జిల్లాల వారీగాఢిల్లీని దాటేసిన ఏపీ: మూడోరోజూ 10వేలు దాటిన కరోనా కేసులు, 68 మరణాలు, జిల్లాల వారీగా

ఢిల్లీలోనే అత్యధికంగా కోలుకుంటున్నారు..

ఢిల్లీలోనే అత్యధికంగా కోలుకుంటున్నారు..

అంతేగాక, యాక్టివ్ కేసుల్లో 1.61 శాతం మంది ఐసీయూలో, 2.32 శాతం మంది ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారని కేంద్రమంత్రి తెలిపారు. దేశంలో దేశ రాజధాని ఢిల్లీలోనే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఢిల్లీలో కరోనా నుంచి 89శాతం మంది కోలుకున్నారని చెప్పారు.

హైదరాబాద్ సహా ఈ నగరాల్లో ఆందోళనకర పరిస్థితి..

హైదరాబాద్ సహా ఈ నగరాల్లో ఆందోళనకర పరిస్థితి..


హైదరాబాద్, బెంగళూరు, పుణె, థానేల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఆందోళనకర పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రమంత్రి హర్షవర్ధన్. కాగా, గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మహా నగర పరిధిలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశం కోలుకుంటోంది.. కోటికిపైగా పరీక్షలు

దేశం కోలుకుంటోంది.. కోటికిపైగా పరీక్షలు

కాగా, దేశంలో ఇప్పటి వరకు 10 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని కేంద్రమంత్రి తెలిపారు. దీంతో రికవరీ రేటు 64.54శాతానికి చేరుకుందన్నారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు కేవలం 33.27 శాతమే ఉన్నాయన్నారు. ఇది మొత్తం కేసుల్లో 1/3 వంతు అని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 21 రోజుల సమయం పడుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 6,42,588 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశామని, గడిచిన నెల రోజుల్లోనే దాదాపు కోటి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టామని హర్షవర్ధన్ తెలిపారు.

Recommended Video

Rs.5,000 to Plasma Donors కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే.. రూ. 5 వేలు : ఏపీ సర్కార్
ప్రపంచంలో మనమే బెటర్..

ప్రపంచంలో మనమే బెటర్..

ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని వివరించారు. మరణాలు రేటు మనదేశంలో 2.18 శాతంగా ఉందని తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా 16,62,685 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,57,168 యాక్టివ్ కేసులున్నాయి. 10,69,126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 35,968 మంది కరోనా బారినపడి మరణించారు.

English summary
Health Minster Dr Harsh Vardhan chaired a meeting of a Group of Ministers on the Covid-19 situation on Friday. He said that of the total number of active cases, only 0.28% are on ventilators, 1.61% on ICU support and 2.32% on oxygen support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X