Face Masks: బంపర్ ఆఫర్, మాస్క్ లేకుంటే రూ. 5 వేలు ఫైన్, 8 రోజులు జైలు, మన దేశంలోనే !
మనాలి/చెన్నై: మాస్క్ వేసుకోకుంటే ఏమౌతుంది, భౌతికదూరం పాటించకుంటే ఏమౌతుంది ?, కరోనా వైరస్ లేదు, తొక్కాలేదు అని పాటుబడేవాళ్లకు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. భౌతికదూరం పాటించకుండా, మాస్క్ వేసుకోకుండా మొండిగా బయటతిరిగే వాళ్లకు ఇక ముందు రూ. 5,000 ఫైన్, 8 రోజులు జైలు శిక్షి విధించడానికి కొత్తగా రూల్ తీసుకువచ్చారు. ఈ కొత్త రూల్ కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు చెప్పింది ఏదేశంలో అనుకుంటున్నారా ?, మనదేశంలోనే. ఇక ముందు మాస్క్ లేకుండా బయటకు వస్తే అక్షరాలా రూ. 5,000 ఫైన్ కట్టి కచ్చితంగా 8 రోజులు ఊచలు లెక్కపెట్టాల్సిందే.

వార్నింగ్ ఇచ్చారు...... ఇక లాంచనమే
హిమాచలప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడికి కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా తోక ఆడించడానికి ప్రయత్నిస్తే కుదరదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనీల్ కుమార్ ఖాచి చెప్పారు. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి అధికారులు అందరూ కఠినచర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అనీల్ కుమార్ అన్నారు.

ఫేమస్ పర్యాటక కేంద్రం
హిమాచలప్రదేశ్ లో ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం మనాలిలో మాస్క్ లు వేసుకోకుండా, భౌతికదూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తెగతిరిగేస్తున్నారని, కరోనా వైరస్ మరింత వ్యాపించడానికి కారణం అవుతున్నారని అధికారులు గుర్తించారు. ఇక ముందు అలా జరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

మళ్లీ లాక్ డౌన్ పెడుతాం..... జాగ్రత్త
దేశంలో లాక్ డౌన్ సడించిన తరువాత మళ్లీ ప్రజలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్థిస్తున్నారని, కరోనా వైరస్ కారణంగా అంటు వ్యాదులు వ్యాపించే అవకాశం ఉందని, ఇలాగే జరిగితే మళ్లీ లాక్ డౌన్ పెట్టాల్సి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను హెచ్చరించారు. అంటు వ్యాదులు వ్యాపించకుండా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చి కరోనా వైరస్ కట్టడికి వారి సహకారం తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, అధికారులకు లవ్ అగర్వాల్ సూచించారు.

జస్ట్ రూ. 5 వేలు ఫైన్, 8 రోజులు జైలు శిక్ష
హిమాచలప్రదేశ్ లోని మనాలిలో ఇప్పటి నుంచి మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ. 5, 000 జరిమానా వసూలు చేసి 8 రోజులు జైల్లో పెడుతామని స్థానిక అధికారులు హెచ్చరించారు. మనాలిలో ఇకముందు మాస్క్ లేకుండా బయకు వచ్చి డ్రామాలు ఆడితే కుదరదని, మేము చేసేపని కచ్చితంగా చేస్తామని స్థానిక అధికారులు ప్రజలకు, పర్యాటకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు.
Recommended Video

దేశం మొత్తం ఇదే రూల్ పాటిస్తే బాగుంటుంది
మనాలిలో చేసిన పని దేశం మొత్తం చేస్తే కరోనా వైరస్ కంట్రోల్ లోకి వస్తుందని ప్రజలు అంటున్నారు. రూ. 50 మాస్క్ వేసుకుని మర్యాదగా బయట తిరిగితే బాగుటుంది, లేదంటే రూ. 5 వేలు ఫైన్ కట్టి 8 రోజులు జైల్లో కుర్చోవలసి వస్తుంది అని అధికారులు వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు షర్టు, ప్యాంటుతో పాటు కచ్చితంగా పోటుగాళ్లు మాస్క్ కూడా వేసుకుంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications