coronavirus: రాజస్థాన్‌లో కరోనా వైరస్ బాధితుల కోసం ఆర్మీ వెయ్యి పడకల ఆస్పత్రి, ఫేక్ అంటోన్న సైన్యం..

కరోనా వైరస్ గురించి కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. దీంతో ప్రజలు కన్ఫ్యూజన్‌కు గురవడంతో.. నిజాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వన్ ఇండియా ముందుకొచ్చింది. వైరస్ గురించి సోషల్ మీడియా తప్పుడు కథనాల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రాజస్థాన్ బర్మార్‌లో ఇండియన్ ఆర్మీ వెయ్యి పడకలతో కూడిన ఆధునాతన ఆస్పత్రిని నిర్మించిందని ప్రచారం జరుగుతోంది. కానీ అది ఫేక్ అని వన్ ఇండియా వెలుగులోకి తీసుకొని రాగా.. దీనిని ఆర్మీ కూడా ధృవీకరించింది.

కరోనా కోసం కాదు


వెయ్యి పడకల ఆస్పత్రి.. అందులో ఆధునాతన సదుపాయాలు, ఆస్పత్రి లోపల ఒక ఫోటో, ఆర్మీ గుమిగూడి ఉన్న ఫోటో మరొకటి.. ఆస్పత్రిని చూపే డ్రోన్ ద్వారా తీసిన ఫోటో మరొకటి కనిపిస్తోంది. కానీ ఇవి పాత ఫోటోలు.. కరోనా వైరస్ సందర్భంగా ఏర్పాటు చేసినవి కావు.. కానీ కొందరు ప్రస్తుత పరిస్థితిని క్యాష్ చేసుకొనేలా షేర్ చేశారు. దీనిని భారత సైన్యం కూడా ధృవీకరించింది. కరోనా వైరస్ కోసం తాము వెయ్యి పడకలతో ఆస్పత్రి శిబిరం నిర్వహించలేదని పేర్కొన్నది.

ఎప్పుడో నిర్మిస్తే..

కానీ సోషల్ మీడియాలో మాత్రం రాజస్థాన్ బర్మార్‌లో వెయ్యి పడకల ఆస్పత్రిని రెండురోజుల క్రితం నిర్మించారని వైరలవుతోంది. ఐసీయూలో 100 వెంటిలెటర్లు కూడా ఉన్నాయని.. ఒకేసారి వెయ్యి మందికి వైద్యం అందించొచ్చని పేర్కొన్నది. అంతేకాదు హెల్ప్‌లైన్ నంబర్ 7700906111 అని కూడా పోస్ట్ చేశారు. సోషల్ మీడియోలో పోస్ట్ అవుతోన్న షేర్‌ను.. గౌరవ్ బిష్ట్ అనే యూజర్.. ప్రతీ 20 మందికి ఒక డాక్టర్, ఆధునాతన సౌకర్యాలు, టీవీ, స్పోర్ట్స్, వినోదాలు కూడా అందించబడుతాయని పేర్కొన్నది. అంతేకాదు ఇలాంటి మరో నాలుగు ఆస్పత్రులు కూడా నిర్మించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఫోటోలు వైరల్

సోషల్ మీడియాలో వైరలవుతోన్న పోస్ట్‌ను ఆర్మీ కూడా ఖండించింది. వేర్వేరు ప్రదేశాల్లో, వేర్వేరు సమయాల్లో ఫోటోలు వైరలవుతోన్నాయని కనుగొన్నామని పేర్కొన్నది. ఇందులో మొదటి ఫోటో 2019 సెప్టెంబర్ 11న ట్రెండ్ అనే వెబ్‌సైట్ ప్రచురించింది. రెండో ఫొటో మాత్రం 2015 ఏప్రిల్ 28వ తేదీన తీసినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+