Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus: కరోనా హాట్ స్పాట్ బెంగళూరు, సీల్ డౌన్ !, సిలికాన్ సిటీలో 76 మందికి, ప్రభుత్వం !

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రపంచం అంతా ప్రస్తుతం లాక్ డౌన్ అనే రామబాణం అనే అయుధాన్ని వదిలింది. అయినా కరోనా వైరస్ వ్యాధిని కట్టడి చెయ్యలేక ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ ను కొన్ని దేశాలు పొడగిస్తున్నాయి. మరి కొన్ని దేశాలు సీల్ డౌన్ చెయ్యాలని నిర్ణయించాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లోని పలు ప్రాంతాలు పూర్తిగా సీల్ డౌన్ అయ్యాయి. ఐటీ బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు పూర్తిగా సీల్ డౌన్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బెంగళూరు సీల్ డౌన్ విషయంపై కర్ణాటక ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని సమాచారం. సిలికాన్ సిటీ బెంగళూరులో ఇప్పటికే 76 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.

కరోనా హాట్ స్పాట్ లో బెంగళూరు

కరోనా హాట్ స్పాట్ లో బెంగళూరు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ హాట్ స్పాట్ లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కరోనా హాట్ స్పాట్ కేంద్రాల జాబితాలో బెంగళూరు నగరం పేరు ఉంది. బెంగళూరు నగరంలోని బీబీఎంపీ వార్డు నెంబర్ 134 బాపూజీనగర్, వార్డు నెంబర్ 135 పాదరాయణపుర ప్రాంతాలు పూర్తిగా సీల్ డౌన్ అయ్యాయి. బెంగళూరు నగరంలో రెండు వార్డులు సంపూర్ణంగా సీల్ డౌన్ కావడంతో నగర ప్రజల్లో ఆందోళన మొదలైయ్యింది.

భారత్ లో రోజురోజుకు కరోనా !

భారత్ లో రోజురోజుకు కరోనా !

భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాధి పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 8, 356 కరోనా వైరస్ వ్యాధితో భాదపడుతున్నారు. వీరు కాకుండా 7, 367 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 716 మంది కరోనా వైరస్ వ్యాధి నయం కావడంతో ఆసుపత్రుల నుంచి వారి ఇళ్లకు వెళ్లారు కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు భారత్ లో నేటి వరకు 273 మంది మరణించారు.

కర్ణాటకలో కరోనా దెబ్బ

కర్ణాటకలో కరోనా దెబ్బ

కర్ణాటకలో ఇప్పటి వరకు 273 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకింది. కర్ణాటకలో ఆరు మంది కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. బెంగళూరులో కరోనా వైరస్ దెబ్బకు ఒకరు మరణించారు. కరోనా హాట్ స్పాట్ కేంద్రాల్లో బెంగళూరు నగరం పేరు ఉ:ది. ఇప్పటి వరకు బెంగళూరు నగరానికి చెందిన 76 మందికి కరోనా వైరస్ వ్యాధి ఉందని అధికారులు నిర్దారించారు.

బెంగళూరు పూర్తిగా సీల్ డౌన్ !

బెంగళూరు పూర్తిగా సీల్ డౌన్ !

బెంగళూరు నగరంలోని బీబీఎంపీ వార్డు నెంబర్ 134 బాపూజీనగర్, వార్డు నెంబర్ 135 పాదరాయణపుర ప్రాంతాలు పూర్తిగా సీల్ డౌన్ అయ్యాయి. పాదరాయణపుర, బాపూజీనగర్ వార్డుల్లో 45 వేల మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ రెండు వార్డుల ప్రజలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆ రెండు వార్డుల ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాలు తదితర నిత్యవసర వస్తువులను బీబీఎంపీ అధికారులు వాళ్ల ఇళ్ల దగ్గరకే వెళ్లి అందిస్తున్నారు. రెండు వార్డులు పూర్తిగా సీల్ డౌన్ కావడంతో బెంగళూరు నగరంలో మిగిలిన వార్డులు సంపూర్ణంగా సీల్ డౌన్ చేస్తారని ప్రజల్లో ఆందోళన మొదలైయ్యింది.

కర్ణాటక ప్రభుత్వం క్లారిటీ

కర్ణాటక ప్రభుత్వం క్లారిటీ

బెంగళూరు మొత్తం సీల్ డౌన్ చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నగరంలోని పాదరాయణపుర, బాపూజీనగర్ వార్డుల్లో కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువ అవుతున్నాయని అధికారులు గుర్తించారని, అందుకే ఆ వార్డులు సంపూర్ణంగా సీల్ డౌన్ అయ్యాయని రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ అన్నారు. అయితే బెంగళూరు సిటీ మొత్తం సీల్ డౌన్ చేస్తామని తాము చెప్పలేదని, కొందరు పుకార్లు పుట్టిస్తున్నారని మంత్రి ఆర్. అశోక్ చెప్పారు.

Recommended Video

    Corona Hotspots Under Strict Vigilance : What's Allowed, What's Prohibited..!
    ఈ నెంబర్ కు ఫోన్ చెయ్యండి

    ఈ నెంబర్ కు ఫోన్ చెయ్యండి

    బెంగళూరు సిటీని ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణంగా సీల్ డౌన్ చెయ్యమని మంత్రి ఆర్. అశోక్ స్పష్టం చేశారు. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ వ్యాధి విస్తరించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు రాకుండా చూడటానికి అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అందులో ఎలాంటి రాజీలేదని మంత్రి ఆర్. అశోక్ అన్నారు. ఇప్పటి వరకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పని చేసి లాక్ డౌన్ సంపూర్ణంగా అమలు అయ్యేలా చూశామని, ఏప్రిల్ 30వ తేదీ వరకు ఇలాగే పని చేస్తామని మంత్రి ఆర్. అశోక్ చెప్పారు. నిత్యవసర వస్తువులు ఇంటింటికి సరఫరా చెయ్యడానికి బెంగళూరు సౌత్ లో హోమ్ డెలవరీ సర్వీస్ ప్రారంభించామని, ఎవరికైనా సమస్యలు ఉంటే 080- 61914960 నెంబర్ కు ఫోన్ చెయ్యాలని కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ బెంగళూరు ప్రజలకు మనవి చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+