బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus కర్మ: ఇంట్లో బెంగళూరు అని చెప్పి బ్యాంకాక్ వెళ్లి ఏం తెచ్చారో తెలుసా ?, అయ్యో !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ కోల్ కతా: బెంగళూరు వెలుతున్నామని ఇళ్లలో చెప్పిన ఇద్దరు పారిశ్రామికవేత్తలు హ్యాపీగా బ్యాంకాక్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. అయితే కరోనా వైరస్ పుణ్యమా అంటూ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఎక్కడికి వెళ్లి వచ్చారో వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ తెలిసిపోయింది. వ్యాపార లావాదేవీల కోసం, వారి పనులపై బెంగళూరు వెళ్లలేదని, బ్యాంకాక్ వెళ్లి వచ్చారని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. పారిశ్రామికవేత్త బ్యాంకాక్ పర్యటన వివరాలు మొత్తం బయటకు రావడంతో వారిని క్వారంటైన్ కు తరలించిన పోలీసులు ఇంటి బయట కరోనా వైరస్ నోటీసులు అంటించారు.

Coronavirus:ఆసుపత్రిలో కరోనా రోగి టిక్ టాక్ వీడియోలతో యువతి హంగామా, సెల్ఫీలు !Coronavirus:ఆసుపత్రిలో కరోనా రోగి టిక్ టాక్ వీడియోలతో యువతి హంగామా, సెల్ఫీలు !

సమాజంలో పెద్ద మనుషులు

సమాజంలో పెద్ద మనుషులు

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాలో నివాసం ఉంటున్న ఇద్దరు పారిశ్రామికవేత్తలు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు వ్యాపార లావాదేవీలలో భాగంగా విదేశాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు తిరుగుతున్నారు.

బెంగళూరు వెలుతున్నాం

బెంగళూరు వెలుతున్నాం

ఇటీవల ఇద్దరు పారిశ్రామికవేత్తలు తాము బెంగళూరు వెలుతున్నామని ఇళ్లలో చెప్పి వెళ్లారు. తరువాత ఇద్దరు పారిశ్రామికవేత్తలు అసలు బెంగళూరు వైపు కన్నెత్తి చూడలేదు. కొన్ని రోజుల తరువాత ఇద్దరు పారిశ్రామికవేత్తలు కోల్ కత్తాలోని ఇళ్లకు వెళ్లారు. బెంగళూరు ట్రిప్ చాలాబాగా జరిగిందని పారిశ్రామికవేత్తలు వారి ఇళ్లల్లో మాయమాటలు చెప్పి వారిని నమ్మించారు.

బెంగళూరు కాదు బ్యాంకాక్

బెంగళూరు కాదు బ్యాంకాక్

కోల్ కత్తాలోని ఇద్దరు పారిశ్రామికవేత్తలకు కరోనా వైరస్ సోకిందా అంటూ అధికారులకు అనుమానం మొదలైయ్యింది. ఇద్దరి అడ్రస్ లు తెలుసుకున్న అధికారులు వారి ఇంటికి వెళ్లారు. ఇద్దరిని క్వారంటైన్ లో ఉండాలని, బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వీరు క్వారంటైన్ లో ఉండాలని వారి భార్యలు ఆరా తీశారు. అప్పుడు వీరు బెంగళూరు వెళ్లలేదని బ్యాంకాక్ వెళ్లి వచ్చారని అసలు కథ తెలిసింది.

రచ్చ రచ్చ చేసిన పెద్దమనుషులు

రచ్చ రచ్చ చేసిన పెద్దమనుషులు

పారిశ్రామికవేత్తలు క్వారంటైన్ లో ఉన్నారని, చుట్టుపక్కల వారు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు వారి ఇంటి ముందు నోటీసులు అంటించారు. అంతేకాకుండా పారిశ్రామివేత్తలు క్వారంటైన్ నుంచి బయటకు వెళ్లకుండా ఇంటి ముందు పోలీసులను కాపాలపెట్టారు. ఆ సమయంలో ఇంటి ముందు కాంపౌడ్ వాల్ కు అంటించిన నోటీసులు చించేసిన పారిశ్రామికవేత్తలు పోలీసులతో గొడవ పెట్టుకుని రచ్చ రచ్చ చేశారు.

మర్యాదగా ఉండాలి, లేదంటే ?

మర్యాదగా ఉండాలి, లేదంటే ?

నోటీసులు చించేసి రచ్చ రచ్చ చేసిన ఆ పెద్ద మనుషులకు వారి కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తూ పోలీసులపై తిరగబడ్డారు. మర్యాదగా ఇంటిలోని క్వారంటైన్ లో ఉండాలని, కరోనా వైరస్ లేదని స్పష్టంగా వెలుగు చూసిన తరువాతే ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి ఇస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద ఇద్దరు పారిశ్రామికవేత్తల నకిలి బెంగళూరు పర్యాటన వివరాలు బయటకు లాగడంతో కరోనా కాటు కథ బయటకు వచ్చింది.

English summary
Coronavirus: Two Businessman Went To Bangkok, Lied Their Wives: Now Under Quarantine in Kolkatta in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X